జెట్‌ఎయిర్‌వేస్‌కు పూర్వవైభవం తెచ్చేవిధంగా బెయిల్‌ ఔట్‌ ప్రణాళిక....

     Written by : smtv Desk | Sat, Feb 16, 2019, 07:07 PM

జెట్‌ఎయిర్‌వేస్‌కు పూర్వవైభవం తెచ్చేవిధంగా బెయిల్‌ ఔట్‌ ప్రణాళిక....

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: రుణభారంతో కొట్టుమిట్టాడుతున్న జెట్‌ఎయిర్‌వేస్‌, జెట్‌ప్రివిలేజ్‌లో ఉన్న వాటాలను మాత్రం అమ్మడానికి సిద్దంగా లేదు. తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం జెట్‌ ఎయిర్‌వేస్‌ బోర్డు బెయిల్‌ ఔట్‌ ప్రణాళికను ఆమోదించింది. కాగా ఈ తాజా నిర్ణయం కొంతమేర అనిశ్చితిని సృష్టించిందనే చెప్పాలి.

ఎయిర్‌లైన్స్‌ను తిరిగి పునరుద్ధరించేందుకు వీలుగా ముందు బెయిల్‌ ఔట్‌ ప్యాకేజిని నిర్ణయిస్తారు. జెట్‌ ప్రివిలేజ్‌ సంస్థకు సుమారు 1.131 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ విలువలున్నట్లు అంచనా. నరేష్‌ గోయాల్‌ ఆధ్వర్యంలోని యాజమాన్యం సమస్యలతో సతమతం అవుతున్న ఎయిర్‌లైన్స్‌ను తిరిగి రంగంలోనికి తీసుకు వచ్చేందుకు వీలుగా పలు ప్రణాళికలు సిద్ధంచేసారు.

ఇందులో బాగంగానే వాటాదారులు బోర్డు బెయిల్‌ ఔట్‌ప్లాన్‌ను ఆమోదించింది. ప్రస్తుతం జెట్‌ఎయిర్‌వేస్‌కు 123 విమానాలు ఉన్నాయి. వీటిలో 16 విమానాలు సొంతం, మిగితావి ఎస్‌ఎల్‌బి విమానాలు లీజుకు తీసుకుని నడుపుతున్నది. వివిధ వాటాల విక్రయం ద్వారా వచ్చే సొమ్మును ముందు రుణభారం తగ్గించేందుకు వినియోగించాలని నిర్ణయించింది. జెపిపిఎల్‌ వాటా విక్రయం మాత్రం తర్వాత నిర్ణయిస్తామని చెపుతున్నారు. జెట్‌ ఎయిర్‌వేస్‌కు అనుబంధంగా పూర్తి సొంత ప్రతిపత్తితో నడిచే విమానయానసంస్థగా జెపిపిఎల్‌ను 2012లోనే ఇన్‌కార్పొరేట్‌చేసుకున్నారు.

2014లో స్వతంత్ర సంస్థగా వైదొలిగింది. ఎఉతిహాద్‌ ఎయిర్‌వేస్‌ పిజెఎస్‌సి 50.1శాతం వాటాలను 150 మిలియన్‌ డాలర్లకు కొనుగోలుచయడమే ఇందుకు కారణంగా మారింది. అప్పట్లో ఈసంస్థను 300 మిలియన్‌ డాలర్లున్న సంస్థగా నిర్ణయించింది. ఎతిహాద్‌ పెట్టుబడులు జెట్‌ ప్రివిలేజ్‌ సంస్థలో సుమారు 600 మిలియన్‌ డాలర్ల వరకూ ఉన్నాయి.

జెట్‌ ఎయిర్‌వేస్‌ ఈ కొనుగోలు ప్రక్రియను 2013లోనే ముగించింది. ఇక లాయల్టీ ప్రోగ్రామ్స్‌ కింద గ్లోబల్‌ మేనేజ్‌మెంట్‌కన్సెల్టెన్సీ సంస్థ జెట్‌ప్రివిలెజ్‌ సంస్థను 1.131 బిలియన్‌ డాలర్లుగా అంచనావేసింది. అంటే సుమారు 7300 కోట్లు గా అంచనావేసారు.

ఏళ్లతరబడి ఇటీవలి విమానయాన పథకాలు ఎయిర్‌లైన్స్‌కు అంతర్జాతీయంగానే లాభాలకేంద్రాలుగా మారాయి. ఎక్కువశాతం ఎయిర్‌లైన్స్‌ లాభాలు అత్యంత ఎక్కువ చవిచూసాయి. మైలేజి పార్టనర్లు,బ్యాంకులు, హోటళ్లు, క్రెడిట్‌కార్డు కంపెనీలను చేర్చుకున్న తర్వాత మరింతపెరిగాయి. ఈనెల 14వ తేదీనే బెయిల్‌ఔట్‌ప్రణాలికకు బోర్డు ఆమోదం తెలిపింది. అయితే దేశీయ బ్యాంకర్లు ఎస్‌బిఐ ఆధ్వర్యంలోని బ్యాంకులు వారి రుణాలను ఈక్విటీకిం దమార్చేందుకు నిర్ణయించింది. వడ్డీ చెల్లింపుల్లోసైతం సంస్థ గతంనుచే బకాయిపడింది.

భారతీయ రిజర్వుబ్యాంకు నిబందనల ప్రకారంచూస్తే జెట్‌ ఎయిర్‌వేస్‌కు 8500 కోట్లవరకూ బకాయిలున్నాయి. ఈక్విటీ చేకూర్పు, రుణపునర్‌వ్యవస్థీకరణ, విక్రయాలు, ఎస్‌ఎల్‌బి, విమానాలకు రీఫైనాన్సింగ్‌ వంటి విధానాలతో మాత్రమే ఈ నిధుల సమస్య భర్తీ కావాలిస ఉంది. బ్యాంకులు ఎట్టిపరిస్థితుల్లోను జెట్‌ఎయిర్‌వేస్‌ప్రమోటర్లుగా రాలేవు.

సంస్థ సిఇఒ వినయ్ దూబే మాట్లాడుతూ జెట్‌ ఎయిర్‌వేస్‌ వృత్తిపరంగా కొనసాగుతున్న కంపెనీ అని బోర్డు డైరెక్టర్లకు నివేదికలు వెళతాయన్నారు. బకాయిల చెల్లింపులో జాప్యం ఉంటే ఎక్కువశాతం మంది సీజుదారులు, విక్రేతలకు రానున్న రోజుల్లో ఈస మస్య తీరిపోతుందన్నారు.

ప్రస్తుతం జెడ్‌ ఎయిర్‌క్రాప్ట్‌ సంబంధిత రుణం 1700 కోట్లువరకూ ఉంది. ఎయిర్‌లైన్స్‌కు నికరంగా 8052 కోట్లు రుణభారం ఉంది. ఇక దేశీయంగా ఇపుడు ట్యారిఫ్‌లు కొంత మెరుగుపడ్డాయని, రానున్న కాలంలో అన్నిస్థాయిల్లోను జెట్‌ఎయిర్‌వేస్‌ పునరుద్ధరణ జరుగుతుందని నరేష్‌ గోయల్‌ ధీమాతో ఉన్నారు.





Untitled Document
Advertisements