నిర్మాణ రంగంలోకి ప్రవేశించిన రోబోలు...ఇక ఉగ్యోగుల కోత తప్పదు...!

     Written by : smtv Desk | Sat, Feb 16, 2019, 07:37 PM

నిర్మాణ రంగంలోకి ప్రవేశించిన రోబోలు...ఇక ఉగ్యోగుల కోత తప్పదు...!

ఫిబ్రవరి 16: మానవాళి సాంకేతిక రంగంలో రోజు రోజుకీ ఓ కొత్త పరికరాలను తయారుచేస్తూ అద్భుతం సృష్టిస్తున్నారు. ఈ మధ్య కాలంలో టెక్నాలజీలో పెనువిప్లవం తీసుకొస్తోంది ఏదైనా ఉంది అంటే అది రోబోటిక్స్ అనే చెప్పాలి, ఆ మద్యన “ఐకియా” సంస్థలో ఫర్నిచర్ చేయటానికి రోబో వాడితే ఆశ్చర్య పోవటం మన వంతయ్యింది.

ఇప్పుడు ఏకంగా రోబోలు నిర్మాణ రంగంలోకి చొరబడ్డాయి, మానవ ప్రమేయం లేకుండానే బరువైన కట్టడాలను సైతం నిర్మిస్తూ మానవాళికి సవాలు విసురుతున్నాయి. ఇటీవల HRP-5P అనే హుమనాయిద్ రోబో ఫారిన్ లో లాంచ్ అయ్యింది. అది నిర్మాణ పనుల్లో చురుకుగా పాల్గొంటూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

సాంకేతికత పెరగటం అన్నది మనిషికి లాభమే అయినప్పటికీ అది మానవాళిని సాశించే స్థాయికి చేరటం అన్నది మనిషి ఉపాధికి ప్రమాదకరం అయ్యే అవకాశం లేకపోలేదు. ఇప్పుడు ఇదే నిర్మాణ రంగంలో గనక రోబోల వినియోగం ఉపందుకుంటే ఆ రంగంలో జీవనోపాధి పొందుతున్న వారికి తీవ్ర స్థాయిలో ఉపాధి కొరత ఏర్పడే ప్రమాదం దగ్గరలోనే ఉందనేది కాదనలేని సత్యం.

ఈ ప్రమాదాన్ని అధిగమించాలి అంటే మనిషి జీవితంలో చొరబడుతున్న ఈ టెక్నాలజీని అయినా నియంత్రించాలి లేదా మనిషి జీవనోపాధికి ప్రమాదం వాటిల్లకుండా కొత్త ఉద్యోగాల కల్పన, నూతన నైపుణ్య శిక్షణ వంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.





Untitled Document
Advertisements