సిటీగ్రూప్‌ సీయివోకు ఈ ఏడాది అధికంగా పెరిగిన వార్షిక పరిహారం

     Written by : smtv Desk | Sat, Feb 16, 2019, 07:48 PM

 సిటీగ్రూప్‌ సీయివోకు ఈ ఏడాది అధికంగా పెరిగిన వార్షిక పరిహారం

ముంభై, ఫిబ్రవరి 16: సిటీగ్రూప్‌ సీయివోకు ఈ సంవత్సరం మరో నాలుగు శాతం పెంచడంతో మొత్తం పరిహారం 2018లో 24 మిలియన్‌ డాలర్లకు పెరిగింది. అంతకు ముందు ఈ నెలలోనే బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా కార్ప్‌ సివొ బ్రెయిన్‌ మోయిన్‌హాన్‌ వార్షిక పరిహారం 15శాతం పెంచి 27 మిలియన్‌ డాలర్లకు పెంచినట్లు ప్రకటించింది.

ఇపుడు తాజాగా సిటిగ్రూప్‌ ఇంక్‌ మాట్లాడుతూ శుక్రవారం చీప్‌ ఎగ్జిక్యూటివ్‌ మైఖెల్‌ కార్బాట్‌ 4.35శాతం పెంపుతో మొత్తం పరిహారం 2018 సంవత్సరానికి 24 మితలియన్‌ డాలర్లుగా చేర్చారు కోర్బాట్‌ మొత్తం పరిహారం మూలవేతనం 1.5 మిలియన్‌ డాలర్లు తోపాటు నగదు బోనస్‌ 6.75 మిలియన్‌ డాలర్లుగాను, ఈక్విటీ అవార్డులు 7.88 మిలియన్‌ డాలర్లుగాను దీర్ఘకాలిక పనితీరు ఆధారిత చెల్లింపు 7.88 మిలియన్‌ డాలర్లుగాను ఉంటుంది. బ్యాంకు పనితీరు, నిర్వహణ తీరు మార్కెట్‌ స్థాయిలు వంటివి పరిహారాన్ని నిర్ణయిస్తాయి.

అంతకుముందు ఏడాది కోర్బాట్‌ 48శాతం పెంపును వార్షికపరిహారంలో పొందారు. 23 మిలియన్‌ డాలర్లుగా ఉంది. నాలుగుశాతం లాభాలు సైతం సర్దుబాటుచేసారు. 2018లో బ్యాంకు తన లక్ష్యాలను సాధించింది. పెట్టుబడులపై రిటర్నులు అంచనాలు అధిగమించాయి. తక్కువస్థాయిలో నిష్పత్తి ఉంటే బ్యాంకు తన ఖర్చులను రాబడిని ఆంచనావేసుకుని సక్రమంగా నిర్వహిస్తున్నదనే అంచనా. రోట్స్‌ అంటే వాటాదారుల సొమ్మును లాభాలు రప్పించేందుకు ఎలా వినియోగిస్తున్నదో అన్న విధానాన్ని రోట్స్‌ సూచిస్తుంది.

ఇన్వెస్టర్లనుంచి ఇటీవలి కాలంలో సిటీగ్రూప్‌ ఎక్కువ ఒత్తిడిని ఎదుర్కొంటున్నది. 2018లో గ్రూప్‌షేర్లు 30శాతంమేర దిగజారాయి. 100శాతానికి డివిడెండ్లరూపంలోనుబైబాక్‌రూపంలోను లాభాలను ఖర్చుచేసింది. వాటాకు రాబడులు 26శాతంపెరిగాయి. రాబడులు ఒకటిశాతంపెరిగాయి.

అంతకుముందు బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా సిఇఒ బ్రియాన్‌ మోయిన్‌హాన్‌ వార్షిక జీతం 15శాతంపెంచి 27 మిలియన్‌ డాలర్లుగా వెల్లడించిందిజనవరిలోనేమోర్గాన్‌స ఏ్టన్లీ సిఇఒ జేమ్స్‌ గోర్మాన్‌ మొత్తం వేతనం ఏడుశాతంపెరిగి 29 మిలియన్‌ డాలర్లుగా నిలిచింది. జెపిమోర్గాన్‌ ఛేజ్‌ అండ్‌కో సిఇఒ వేతన ప్యాకేజి ఐదుశాతంపెరిగి 31 మిలియన్‌ డాలర్లుగా నిలిచింది.





Untitled Document
Advertisements