రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ట్రైలర్ కు ఎన్ని డిజిటల్ వ్యూసో !!

     Written by : smtv Desk | Sat, Feb 16, 2019, 07:57 PM

రామ్ గోపాల్ వర్మ  'లక్ష్మీస్ ఎన్టీఆర్' ట్రైలర్ కు ఎన్ని  డిజిటల్ వ్యూసో !!

హైదరాబాద్, ఫిబ్రవరి 16: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సీనియర్ ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న సినిమా 'లక్ష్మీస్ ఎన్టీఆర్'. ఈ సినిమాలో 1989 ఎన్నికల్లో ఆయన ఓడిపోయిన సమయంలో ఆయన జీవితంలో లక్ష్మి పార్వతి ప్రవేశించాక చోటు చేసుకున్న పరిణామాలు, రాజకీయాల మాటున మరుగున పడ్డ నిజాలు, చాలా ఏళ్లుగా బయటకు రాకుండా దాచిన నిజాలను కథా వస్తువుగా తీసుకుని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమాకు సంబందించిన ట్రైలర్ ఇటీవలే విడుదలైంది, కథాంశమే వివాదాస్పదమైనది కావటం, సినిమా మొదలైనప్పటి నుండి వర్మ చేసిన అగ్రెసివ్ పబ్లిసిటీ వెరసి ఈ సినిమాపై అంచనాలను పెంచేసాయి. అంచనాలకు తగినట్టే విడుదలైన ట్రైలర్ యూట్యూబ్ లో సంచలనాలు సృష్టిస్తోంది 5.8మిలియన్ల వ్యూస్ తో నంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతూ ఉంది.

లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ కు మొత్తం కోటి డిజిటల్ వ్యూస్ వచ్చాయి, ఈ విషయాన్నీ రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు.





Untitled Document
Advertisements