విడుదలకు సిద్దమైన 'లై'

     Written by : smtv Desk | Mon, Jul 31, 2017, 12:53 PM

విడుదలకు సిద్దమైన 'లై'

హైదరాబాద్, జూలై 31 : ప్రస్తుతం నితిన్ చేస్తున్న చిత్రం 'లై'. హను రాఘవ పూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను 14 రీల్స్ పతాకం పై రామ్ ఆచంట, గోపి ఆచంట, అనిల్ సుంకర్ లు కలిసి నిర్మిస్తున్నారు. ఇందులో ప్రత్యేక పాత్రలో అర్జున్, కథానాయికగా మేఘ ఆకాశ్ నటిస్తున్నారు.

ఈ చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ... ''లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఆగస్టు 11 న విడుదల చేస్తున్నాం. నితిన్, అర్జున్ మధ్య సాగే సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. ఇప్పటి వరకు విడుదల చేసిన టీజర్, రెండు పాటలను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. చిత్ర ట్రైలర్ ను ఆగస్టు మొదటి వారంలో విడుదల చేస్తున్నాం '' అని వెల్లడించారు.





Untitled Document
Advertisements