అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ పై కేసు పెట్టిన 16 రాష్ట్రాలు...!

     Written by : smtv Desk | Tue, Feb 19, 2019, 04:25 PM

అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ పై కేసు పెట్టిన 16 రాష్ట్రాలు...!

కాలిఫోర్నియా, ఫిబ్రవరి 19: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మెక్సికో సరిహద్దు గోడ వివాదంలో అక్కడ జాతీయ అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు శుక్రవారం అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ 16 రాష్ట్రాలు కాలిఫోర్నియాలోని ఫెడరల్‌ కోర్టును ఆశ్రయించాయి. ట్రంప్‌ నిర్ణయం రాజ్యాంగాన్ని ఉల్లఘించడమేనని కోర్టులో దావా వేశాయి. ట్రంప్‌ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డాయి. ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం చట్ట విరుద్ధమని నిధుల కేటాయింపుల విషయంలో కాంగ్రెస్‌ అనుమతి తప్పనిసరి అని పేర్కొన్నాయి.

ట్రంప్‌ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌ జేవియర్ బీసెర్రా ఈ ప్రతిపాదనను తీసుకోచ్చారు. సైనికులు, విపత్తులు, ఇతర అవసరాల కోసం కేటాయించిన నిధులను దారి మళ్లీస్తే భవిష్యత్తులో ముప్పు తప్పదని ఆయన హెచ్చరించారు. ట్రంప్‌ నిర్ణయానికి వ్యతిరేకంగా దావా వేసిన దేశాల్లో కాలిఫోర్నియా, కొలరాడో, కనెక్టికట్, డెలావేర్, హవాయి, ఇల్లినాయిస్, మైనే, మేరీల్యాండ్, మిచిగాన్, మిన్నెసోటా, నెవాడా, న్యూ జెర్సీ, న్యూ మెక్సికో, న్యూయార్క్, ఒరెగాన్, వర్జీనియా రాష్ర్టాలున్నాయి.





Untitled Document
Advertisements