కోల్‌కతా సిపి రాజీవ్ కుమార్‌ను బదిలీ చేస్తూ రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ

     Written by : smtv Desk | Tue, Feb 19, 2019, 08:16 PM

కోల్‌కతా సిపి రాజీవ్ కుమార్‌ను బదిలీ చేస్తూ రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ

కోల్‌కతా, ఫిబ్రవరి 19: పశ్చిమ్ బెంగాల్ ప్రభుత్వం కోల్‌కతా సిటీ పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్‌ను బదిలీ చేస్తూ పలు కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా దీని సంభందించిన ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. కాగా కొత్తగా సిఐడీ ఎడిజి అండ్ ఐజిపిగా రాజీవ్ కుమార్ కు పదోన్నతి కల్పించింది. ప్రస్తుతం అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్‌ పోలీస్‌(లా అంఢ్ ఆర్డర్)గా పని చేస్తున్న అనుజ్ శర్మను కోల్‌కతా కొత్త పోలీస్ కమిషనర్‌గా నియమించింది. 1991 బ్యాచ్ ఐపిఎస్ అధికారి అయిన అనుజ్ మంగళవారం సిపిగా బాధ్యతలు స్వీకరించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో అధికారులను బదిలీ చేయాలని ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేయడంతో రాష్ట్రంలో అధికారులను బదిలీ చేశారు.

2016 మేలో రాజీవ్ కుమార్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. శారద చిట్‌ఫండ్ కుంభకోణం కేసులో సిట్ కు నేతృత్వం వహిస్తున్న‌ సిపి రాజీవ్ కుమార్ ఈ కేసులోని ఆధారాలను మాయం చేశారంటూ గతంలో సిబిఐ ఆరోపించిన విష‌యం తెలిసిందే. ఈ విషయమై రాజీవ్ కుమార్ ను ప్రశ్నించేందుకు ఇటీవల 40 మందికి పైగా సిబిఐ అధికారులు ఆయన ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో సిబిఐ అధికారులను స్థానిక పోలీసులు అడ్డుకోవడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో సిబిఐ అధికారుల తీరును నిరసిస్తూ ఆ రాష్ట్ర సిఎం మమత దీక్ష కూడా చేశారు. అనంతరం అక్కడ ఎన్ డిఎయేతర పక్షాల నేతలు ర్యాలీ కూడా తీశారు.





Untitled Document
Advertisements