2,500 మందికి గర్భం తెప్పించడమే అతని టార్గెట్....!

     Written by : smtv Desk | Tue, Feb 19, 2019, 08:32 PM

2,500 మందికి గర్భం తెప్పించడమే అతని టార్గెట్....!

ఆస్ట్రేలియా, ఫిబ్రవరి 19: ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి ఒక్కటి కాదు రెండు దాదాపు 800 వందల మందికి గర్భం తెప్పించడానికి ప్రయత్నించాడు. అంతేకాదు అతని టార్గెట్ 2500 మందికి గర్భం తెప్పించడం అంటా...వినడానికి కాస్త వింతగా ఉన్నా ఇది నిజం. వివరాల ప్రకారం అతని పేరు జో డోనార్. అసలు పేరేంటో ఎవరికీ చెప్పడు. తనను తాను మిరాకిల్ మేకర్‌గా చెప్పుకునే ఈ జో ఈ మధ్య ఓ ఆస్ట్రేలియా టీవీ చానల్ ముందుకొచ్చాడు. తన వీర్యదానం ముచ్చట్ల గురించి చెప్పాడు. ‘నాకు సెక్సు ద్వారానే వీర్యదానం చేయడం ఇష్టం. అలా చేస్తేనే ఫలితాలు బాగుంటాయి. కానీ నేను స్త్రీలోలుడిని కాను. వారికి పిల్లల్ని పుట్టించడమే నా అసలు ఉద్దేశం. సెక్స్ వద్దంటే వీర్యదానం చేస్తాను. అయితే అందుకయ్యే ఖర్చులన్నీ గ్రహీతలే భరించాలి.. నా క్లయింట్లలో సగం మంది నాతో సెక్స్‌కే ప్రాధన్యమిస్తారు..’ అని అన్నాడు.

అతణ్ని ఇంటర్వ్యూ చేస్తున్న మహిళ మధ్యలో కల్పించుకుని చెడామడా తిట్టేసింది. అంతమందితో శృంగారంలో పాల్గొంటే జబ్బులురావా? అని ప్రశ్నించింది. అందుకతడు పెద్దగా స్పందించకుండా తన టార్గెట్ గురించే చెప్పుకొచ్చాడు. ‘మీరు నాకేం అణ్వస్త్రాల ఫ్యాక్టరీ తాళాలు ఇవ్వడం లేదు. కేవలం బిడ్డల్ని పుట్టిస్తున్నానంతే.. ’ అని అన్నాడు. ఇలాంటి చికిత్స విషయంలో పరీక్షలు గట్రా అంటూ ఐవీఎఫ్ క్లినిక్కులు డబ్బులు గుంజుతుంటాయని, తన వద్దకు వస్తే ఖర్చు లేకుండానే బిడ్డల్ని పొందొచ్చని అన్నాడు.





Untitled Document
Advertisements