కేంద్రానికి మధ్యంతర డివిడెండ్‌గా రూ.28,000 కోట్లు..

     Written by : smtv Desk | Tue, Feb 19, 2019, 09:11 PM

కేంద్రానికి మధ్యంతర డివిడెండ్‌గా రూ.28,000 కోట్లు..

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 2018 ఏప్రిల్‌ నుంచి 2019 మార్చి ఆర్థిక సంవత్సరంలో కేంద్రం ద్రవ్యలోటు ఇబ్బంది నుంచి కొంతమేర బయటపడే కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను రూ.28,000 కోట్ల మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. ఈ ప్రకటనకు ముందు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ఆర్‌బీఐ బోర్డ్‌ సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు.

ఇటీవల జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఉగ్రవాదదాడిలో వీరమరణం పొందిన భారత జవాన్లకు నివాళులర్పిస్తూ... ఆర్‌బీఐ బోర్డ్‌ సమావేశం రెండు నిముషాలు మౌనం పాటించింది. అనంతరం బడ్జెట్ కి సంనదించిన పలు విషయాలు చర్చించారు.





Untitled Document
Advertisements