'పాక్ తో యుద్ధం చేసేందుకు మేం సిద్దం' : మోడీకి లేఖ రాసిన ఖైదీలు

     Written by : smtv Desk | Tue, Feb 19, 2019, 09:22 PM

'పాక్ తో యుద్ధం చేసేందుకు మేం సిద్దం' : మోడీకి లేఖ రాసిన ఖైదీలు

బీహార్, ఫిబ్రవరి 19: సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రవాదుల దాడి వార్తను విన్న గోపాల్‌గంజ్ సబ్ డివిజినల్ జైల్లో ఉన్న ఖైదీలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంతేకాక సైనిక కుటుంబాలను ఆదుకునేందుకు తమ వంతు సాయంగా రూ.50 సేకరించి విరాళం అందజేశారు. కాగా ఈ జైలులో మొత్తం 750 మంది ఖైదీలు ఉన్నారు. ఇందులో 30 మంది మహిళలు కూడా. వీరందరికీ జమ్మూకశ్మీర్‌లో పుల్వామా ఉగ్రదాడిలో మన సైనికులు మృతి చెందిన విషయం తెలుసుకుని కడుపు రగిలిపోయింది. వెంటనే ఖైదీలందరూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. అందులో ‘యుద్ధం వస్తే మేం సరిహద్దుల్లో శత్రువులతో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాం. దేశం కోసం చేసే యుద్ధంలో మేము మరణిస్తే మమ్మల్ని అమరులుగా గుర్తించండి.

యుద్ధం చేసి ప్రాణాలతో బయటపడితే జైలు అధికారులకు ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా మేమే మళ్లీ జైలుకు వస్తాం’ అని 250మంది ఖైదీలు సంతకాలు చేశారు. జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు.. ఖైదీలు నెల రోజుల పాటు అగర్ బత్తుల తయారీ, పండ్లు, కూరగాయలు పండించగా వచ్చిన డబ్బులు రూ.50వేలు సేకరించి జవాన్ల కుటుంబాలకు విరాళంగా ఇచ్చారు. ఖైదీల సాయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వీరి చేసిన సాయంపై నెటిజన్లు పోస్టులు కూడా పెడుతున్నారు. ‘ఖైదీలు చేసిన సాయం చిన్నదే అయినా.. వారి సంకల్పం మాత్రం చాలా గొప్పది’ అని దానికి ట్యాగ్ లైన్ రాస్తున్నారు.





Untitled Document
Advertisements