కేంద్ర ప్రభుత్వోద్యోగులకు భారీ బహుమతి...డీఏ 3% పెంపు

     Written by : smtv Desk | Tue, Feb 19, 2019, 10:38 PM

 కేంద్ర ప్రభుత్వోద్యోగులకు భారీ  బహుమతి...డీఏ 3% పెంపు

న్యూఢిల్ల్లీ, ఫిబ్రవరి 19: నరేంద్ర మోదీ సర్కార్ కేంద్ర ప్రభుత్వోద్యోగులకు భారీ బహుమతి ప్రకటించింది. ఈ నేపథ్యం లో కేంద్రం ప్రభుత్వోద్యోగుల కరువు భత్యాన్ని(డీఏ) 3% పెంచింది. ఈ కీలక నిర్ణయంతో ప్రభుత్వంపై రూ.9,168 కోట్ల అదనపు భారం పడనుంది. అయితే ఈ రోజు మంగళవారం కేంద్ర కేబినెట్ ముందుకి డీఏని పెంచాలన్న ప్రతిపాదన వచ్చింది. దీనికి మంత్రివర్గం తన ఆమోదం తెలిపింది.

ఢిల్లీ-ఘాజియాబాద్-మీరట్ ర్యాపిడ్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్ నిర్మాణ ప్రతిపాదనకు కూడా మంత్రి మండలి ఆమోదం తెలిపినట్టు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. దీనికి రూ.30,274 కోట్ల వ్యయం అవుతుంది. అలాగే ట్రిపుల్ తలాఖ్ ఆర్డినెన్స్ కి కూడా మోదీ సర్కార్ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. కిసాన్ ఊర్జా సురక్షా ఔర్ ఉత్థాన్ మహాభియాన్ (కుసుమ్) పథకానికి కూడా కేబినెట్ ఆమోదం లభించినట్టు అరుణ్ జైట్లీ తెలిపారు.





Untitled Document
Advertisements