'ఉత్తమ ఉద్యోగి' పదవి విరమణ

     Written by : smtv Desk | Mon, Jul 31, 2017, 08:04 PM

'ఉత్తమ ఉద్యోగి' పదవి విరమణ

ఆసిఫాబాద్, జూలై 31: హౌసింగ్ శాఖ(ఆదిలాబాద్ జిల్లా)లో గత 32 సంవత్సరాలుగా విశిష్ట సేవలందించిన సుబ్బ శంకర్ సోమవారం పదవి విరమణ చేసారు. ఆయన 1985 అక్టోబర్ 15న హౌసింగ్ కార్పోరేషన్ లో స్టోర్ ఇంచార్జ్ గా పదవి బాధ్యతలు స్వీకరించారు.

శంకర్ 14 సంవత్సరాల నిరంతర కృషికి గాను 1999లో జూనియర్ అసిస్టెంట్ గా పదోన్నతి పొందారు. జనవరి 26 2000 సంవత్సరంలో అప్పటి ఆదిలాబాద్ కలెక్టర్ ఎ. రామకృష్ణ చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగి అవార్డును తీసుకున్నారు.

ఇంతింతై వటుడంతై అన్నట్టుగా 2008 జూలై 14న సీనియర్ అసిస్టెంట్ గా మరో మారు పదోన్నతి దక్కించుకున్నారు. కొంతకాలానికి ఖాదీబండర్ కు డిప్యూటేషన్ మీద బదిలీయైన ఆయన అక్కడ కూడా పలువురి ప్రశంసలు అందుకున్నారు.

విధి నిర్వాహణలో తనదైన శైలితో ఆయన సహుద్యోగులకు సైతం ప్రేరణగా నిలిచేవారు. ఉన్నతాధికారులకు తోడ్పాటుగా ఉంటూ సహాయ సహకారాలు అందించేవారని తోటి అధికారులు ప్రశంసా జల్లులు కురిపించారు.

దీనిపై ఓ ఉన్నతాధికారి మాట్లాడుతూ... "మాకు మంచి స్పూర్తి మార్గదర్శకాన్ని ఇచ్చే సహుద్యోగైన శంకర్ గారికి బరువెక్కిన హృదయాలతో పదవి విరమణ వీడ్కోలు పలుకుతున్నాం," అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఖాదీబండర్ కార్యాలయ సిబ్బంది శంకర్ కు పూలమాలలు వేసి, మోమెంటో, శాలువలతో సత్కరించి ఘనంగా పదవి విరమణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసారు.





Untitled Document
Advertisements