తనీష్ విచారణలో కీలక అంశాలు వెల్లడి

     Written by : smtv Desk | Tue, Aug 01, 2017, 11:50 AM

తనీష్ విచారణలో కీలక అంశాలు వెల్లడి

హైదరాబాద్, ఆగస్టు 1 : డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న 12 మందిలో సిట్ అధికారులు ఇప్పటి వరకు 10 విచారించారు. 11 వ వ్యక్తిగా హీరో తనీష్ ను సోమవారం అధికారులు విచారిస్తూ... కెల్విన్ తో ఉన్న సంబంధాలు, యువ నటులతో ఉన్న పరిచయాలపై సిట్ అధికారులు ఆరాతీశారు. అయితే ఇందులో తనీష్ కీలక విషయాలు బయటపెట్టారని తెలుస్తుంది.

సిట్: కెల్విన్ తో మీకు ఎలాంటి పరిచయం ఉంది.?

తనీష్: కెల్విన్ నా సినిమాలకు ఈవెంట్స్ చేసేవాడు. అందువల్ల అతనితో పరిచయం ఏర్పడింది.

సిట్: కెల్విన్ తో డ్రగ్స్ కూడా తెప్పించుకునే వారని మా దగ్గర ఆధారాలు ఉన్నాయి.?

తనీష్: కెల్విన్ తో పరిచయం ఉన్న మాట నిజమే కాని అది సినిమా ఫంక్షన్స్ వరకు మాత్రమే డ్రగ్స్ తో ఎలాంటి సంబంధం లేదు.!

సిట్: యువ హీరోలతో ఉన్న పరిచయాలు ఎలాంటివి ?

తనీష్: నేను సినిమా ఇండస్ట్రీకి బాల నటుడిగా అడుగుపెట్టాను. ఇప్పుడిప్పుడే హీరోగా నిలదొక్కుకుంటున్నాను. అందులో భాగంగానే తరుణ్ తో సాన్నిహిత్యంగా ఉంటున్నాను.! అని అన్నారని సిట్ వర్గాలు తెలిపారు.

ఉదయం 10.30 గంటలకు మొదలైన ఈ విచారణ మద్యాహ్నం 2.30 గంటల వరకు కొనసాగింది.





Untitled Document
Advertisements