వేసవి లో హాయిగా .. 'నో' కరెంటు కటింగ్

     Written by : smtv Desk | Tue, Mar 12, 2019, 01:15 PM

వేసవి లో హాయిగా .. 'నో' కరెంటు కటింగ్

హైదరాబాద్,, మార్చ్ 12: వేసవిలో రెప్పపాటు కూడా అంతరాయం లేకుండా కరెంట్ సరఫరా చేస్తామని జెన్ కో , ట్రాన్స్​కో సీఎండీ ప్రభాకర్​రావు చెప్పారు. సోమవారం ఎన్ పీడీసీఎల్ సీఎండీ గోపాల్ రావులతో కలిసి ఆయన 17 జిల్లాలకు చెందిన ఇంజనీరింగ్​అధికారులతో సమీక్ష నిర్వహించారు. అంతకుముందు కరెంటు సరఫరాలో అంతరాయాన్ని గుర్తించే స్కాడా టెక్నాలజీని వరంగల్ లో ప్రారంభించారు. దీని పరిధిలో 21 సబ్ స్టే షన్లు, 19 ఫీడర్లు ఉన్నాయని చెబుతూ.. ఈ పరిధిలో ఎక్కడ కరెంట్ పోయినా ఈ సాఫ్ట్ వేర్​గుర్తించి, దగ్గర్లోని ఇతర సబ్ స్టేషన్, ఫీడర్ల ద్వా రా సరఫరాను పునరుద్ధరిస్తుందన్నారు. దీంతో రెప్పపాటు సమయం కూడా కరెంటు పోదన్నారు. దక్షిణ కొరియా నుంచి దిగుమతి చేసుకున్న ఈ టెక్నాలజీ మన దేశంలో కేవలం రెండు చోట్ల మాత్రమే ఉపయోగిస్తున్నట్లు ప్రభాకర్​రావు చెప్పారు. తర్వాత కొత్తగూడెంలో 120 కేవీపీ సోలార్ విద్యుత్ కేంద్రాన్ని రిమోట్ ద్వారా ప్రారంభించారు. విద్యుత్‍ రంగంలో యాభై ఏళ్ల పాటు నిర్వి రామంగా సేవలందించిన ప్రభాకర్​రావును ఎన్పీడీసీఎల్ యాజమాన్యం , ఉద్యోగ సంఘాలు ఘనంగా సన్మానించాయి.





Untitled Document
Advertisements