ఎలక్షన్ కోడ్ ను అతిక్రమించిన వారిపై అనర్హత వేటు...2020 జూన్ వరకు

     Written by : smtv Desk | Wed, Mar 13, 2019, 02:14 PM

ఎలక్షన్ కోడ్ ను అతిక్రమించిన వారిపై అనర్హత వేటు...2020 జూన్ వరకు

హైదరాబాద్, మార్చ్ 13: తెలంగాణా రాష్ట్రంలో గత ఎన్నికల సమయంలో పోటీ చేసిన అభ్యర్తులో ఎలక్షన్ కోడ్ ను అతిక్రమించిన వారిపై కేంద్ర ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్ కుమార్ మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో శాసనసభ ఎన్నికల్లో 21 నియోజకవర్గాల నుంచి 45 మంది పోటీ చేశారు. 2020 జూన్‌ వరకు ఎన్నికల పోటీ చేసేందుకు వారు అనర్హులు. కొల్లాపూర్‌ నుంచి అత్యధికంగా ఎనిమిది మందిపై వేటు పడింది. షాద్‌నగర్‌, గద్వాల్‌ నుంచి అయిదుగురు చొప్పున, రామగుండం నుంచి నలుగురు, సిరిసిల్ల, నారాయణపేట, వనపర్తి, ఆలంపూర్‌ ఇద్దరు చొప్పున అనర్హత వేటుకు గురయ్యారు. కామారెడ్డి, ధర్మపురి, పినపాక, ఇల్లెందు, ఖమ్మం, పాలేరు, వైరా, సత్తుపల్లి, కొత్తగూడెం, హుస్నాబాద్‌, మహబూబ్‌నగర్‌, జడ్చర్ల నియోజకవర్గాల నుంచి ఒక్కొక్కరు చొప్పున అనర్హులు. లోక్‌సభకు పోటీ చేసిన 17 మంది అభ్యర్థులు 2022 జనవరి వరకు అనర్హులు. కరీంనగర్‌, హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాల నుంచి ఆరుగురు, సికింద్రాబాద్‌ నుంచి పోటీ చేసిన అయిదుగురు అభ్యర్థులపై ఎన్నికల సంఘం వేటు వేసింది. అయితే వారంతా ఆయా ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు కావడం విశేషం.





Untitled Document
Advertisements