రైతులకు పంట రుణాలు, పెట్టుబడి రుణాలు కలిపి రూ.23,329 కోట్లు పంపిణీ

     Written by : smtv Desk | Thu, Mar 14, 2019, 03:40 PM

రైతులకు పంట రుణాలు, పెట్టుబడి రుణాలు కలిపి రూ.23,329 కోట్లు పంపిణీ

మార్చ్ 14: బుధవారం హైదరాబాద్ లో జరిగిన 22వ త్రైమాసిక రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితిలో ఎస్‌ఎల్‌బిసి ఛైర్మన్, ఎస్‌బిఐ సిజిఎం జె.స్వామినాథన్ పలు విషయాలను వెల్లడించారు. రైతులకు పంట రుణాలు, పెట్టుబడి రుణాలు కలిపి రూ.23,329 కోట్లు పంపిణీ చేసినట్లు ప్రకటించారు. అలాగే రబీ సీజన్‌కు సంబంధించి రైతులకు గత డిసెంబర్ నెలాఖరు వరకు రూ.5226 కోట్లు (30 శాతం) పంపిణీ చేశామని, ఈ ఫిబ్రవరి నెలాఖరుకు వచ్చేసరికి రుణ పంపిణీ రూ. 9772 కోట్లకు (63.71) శాతానికి పెరిగిందని అన్నారు. పెట్టుబడి రుణాలు మాత్రం రూ. 13,467 కోట్లు పంపిణీ చేశామని, ఈ రెండు సెక్టార్లలో కలిపి రైతులకు రూ. 23,239 కోట్లు పంపిణీ చేశామన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు మూడు నెలల్లో రూ. 2816 కోట్లు పంపిణీ చేయగా, ఏడాదిలో రూ. 9,363 కోట్లు పంపిణీ చేశారు. ఎస్‌సి, ఎస్‌టి వర్గాలకు గత మూడు నెలల్లో రూ. 843 కోట్లు పంపిణీ చేయగా, వార్షిక సంవత్సరంలో రూ.3022 కోట్లు పంపిణీ చేసినట్లు స్వామినాధన్ తెలిపారు. ఇక 2018 ఏఫ్రిల్ ఒకటో తేదీ నుంచి 9,05,564 మంది లబ్దిదారులకు ముద్ర రుణాల పథకంలో రూ. 5,665 కోట్లు పంపిణీ చేయడం గమనార్హం. అలాగే 74.31 లక్షల మందికి రూపే కార్డులు పంపిణీ చేసినట్లు నివేదికలో తెలిపారు. క్రెడిట్ డిపాజిట్లు కూడా 117.99 శాతం నుంచి 119.05 శాతానికి పెరిగాయి. ఈ సమీక్షా సమావేశంలో ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వ్యవసాయ శాఖ కమిషనర్ రాహుల్ బొజ్జా, ఆర్‌బిఐ రీజినల్ డైరెక్టర్ సుబ్రతాదాస్, నాబార్డు సిజిఎం విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.





Untitled Document
Advertisements