నా పాత్ర ఉంటె ఉరి తీయండి!

     Written by : smtv Desk | Sat, Mar 16, 2019, 12:27 PM

నా పాత్ర ఉంటె ఉరి తీయండి!

కడప, మార్చ్ 16: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో మొదట వైఎస్ రాజారెడ్డి హత్య కేసులో శిక్ష అనుభవించి విడుదలైన సుధాకర్ రెడ్డి పేరు వినిపించింది. అయితే ఈ విషయంపై మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేసాడు. వివేకానందరెడ్డి ఇల్లు ఎక్కడున్నదో కూడా తనకు తెలియదని, అసలు వైఎస్ రాజారెడ్డి హత్యకు కూడా తనకు సంబంధం లేదనీ అన్నారు. అన్యాయంగా తనను ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను 12 సంవత్సరాలు జైల్లో నరకయాతన అనుభవించి వచ్చానని తెలిపాడు. గతేడాది జూన్ 20న తాను జైలు నుంచి విడుదల అయ్యానని తెలిపారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన సమయంలో తాను ఇంట్లోనే ఉన్నానని వ్యాఖ్యానించారు. తన పేరు టీవీలో రావడంతో తాను పోలీస్ స్టేషన్‌కు వెళ్లివచ్చానన్నారు. అయితే ఎస్సై లేకపోవడంతో కానిస్టేబుల్‌తో మాట్లాడి వచ్చానన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి వ్యవహారంలో తన పాత్ర ఉన్నట్లు తేలితే ఉరితీయాలని స్పష్టం చేశారు.





Untitled Document
Advertisements