నెగటివ్ రోల్ లో నాని

     Written by : smtv Desk | Sat, Mar 16, 2019, 09:29 PM

నెగటివ్ రోల్ లో నాని

హైదరాబాద్, మార్చ్ 16:ఎంతో కష్టపడి నాచురల్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్న నాని ఇప్పుడు కెరియర్ లో ప్రయోగాలకు సిద్ధమయ్యాడు. నాని ప్రస్తుతం జెర్సీ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత ఇంద్రంగటి మోహనకృష్ణ డైరక్షన్ లో ఓ సినిమా చేస్తాడని తెలిసిందే. ఈ మూవీలో మరో హీరో సుధీర్ బాబు కూడా నటిస్తారని తెలుస్తుంది. అయితే ఇక్కడ మరో విశేషం ఏంటంటే సినిమాలో నాని విలన్ గా నటిస్తున్నాడట. పూర్తిస్థాయి నెగటివ్ రోల్ లో నాని ఈ సినిమాలో కనిపిస్తాడని తెలుస్తుంది.

నానిని హీరోగా ఇంట్రడ్యూస్ చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ ఈ సినిమాకు దర్శకుడు. ఈ దర్శకుడు నానితో జెంటిల్ మెన్ సినిమా చేశాడు. ఆ సినిమాలో నానిని కొద్దిపాటి నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో చూపించి మంచి మార్కులు కొట్టేశాడు. మొత్తానికి నాని విలన్ గా ఎలా మెప్పిస్తాడో చూడాలి. జెర్సీ ఏప్రిల్ 19న రిలీజ్ కాబోతుంది. ఆ తర్వాతే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. అదితి రావు హైదరి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుందట.





Untitled Document
Advertisements