హత్యకు గురైంది సామాన్యమైన వ్యక్తి కాదు

     Written by : smtv Desk | Sat, Mar 16, 2019, 09:31 PM

హత్యకు గురైంది సామాన్యమైన వ్యక్తి కాదు

తన బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై టీడీపీ నాయకులు రాజకీయాలు చేస్తున్నారని, ఏపీ పోలీసు దర్యాప్తును నమ్మలేమని ప్రధాన విపక్షం వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఈయన రోజు గవర్నర్ నరసింహన్‌ను కలుసుకుని ఫిర్యాదు చేశారు.

తర్వాత మీడియాతో మాట్లాడారు. ‘మా చిన్నాన్న హత్యపై గవర్నర్ గారికి ఫిర్యాదు చేశాం. నిజాలు బయటికి రావాలంటే కేసును సీబీఐకి అప్పగించాలి. రాష్ట్రంలో అసలు శాంతిభద్రతలు లేవు. ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డిని ఢీకొట్టేందుకు మేం జమ్మలమడుగులో కొత్త అభ్యర్థిని తీసుకొచ్చాం. దీంతో నియోజకవర్గంలో అత్యధికంగా తిరుగుతున్న చిన్నాన్నను దారుణంగా హత్య చేశారు. ఇందులో టీడీపీ హస్తం లేకపోతే సీబీఐ విచారణకు ఇచ్చేందుకు ఎందుకు వెనుకాడుతున్నారు? హత్యకు గురైంది సామాన్యమైన వ్యక్తి కాదు. ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలుపొందిన వ్యక్తి. రాత్రి ఇంట్లో ఒక్కరే ఉన్నారని తెలుసుకొని పక్కా వ్యూహంతో కిరాతకంగా చంపేశారు.. ఏపీ డీజీపీ, అదనపు డీజీ వెంకటేశ్వరరావు లాంటి వ్యక్తుల్ని ఎన్నికల బాధ్యతలనుంచి తప్పించాలని గవర్నర్‌ను కోరారం. రెండు రోజుల్లో ఈ కేసును సీబీఐకి అప్పగించకపోతే కోర్టు మెట్లు ఎక్కుతాం. వివేకాకు ఎలాంటి సెక్యూరిటీ లేదు, ఆయన చాా సౌమ్యులు. చంద్రబాబు హస్తం లేకపోతే సీబీఐ విచారణకు ఎందుకు వెనకాడుతున్నారు? చంద్రబాబు ప్రమేయం లేని అధికారులతో దర్యాప్తు జరపాలి. ఏపీ పోలీసు వ్యవస్థ ప్రభుత్వానికి తొత్తుగా మారింది. వివేకానంద కేసులో మాకు న్యాయం జరగాలి. సీబీఐ దర్యాప్తు కోసం మేం కోర్టుకు వెళ్తాం.. ’ అని అన్నారు.





Untitled Document
Advertisements