అనుష్క సినిమాలో హాలీవుడ్ స్టార్..!

     Written by : smtv Desk | Sun, Mar 17, 2019, 08:30 AM

అనుష్క సినిమాలో హాలీవుడ్ స్టార్..!

హైదరాబాద్, మార్చ్ 17:స్వీటీ అనుష్క ఈమధ్య స్పెషల్ డైటింగ్ సిస్టెంతో కాస్త సన్నబడినట్టు తెలుస్తుంది. రీసెంట్ గా బయటకు వచ్చిన అనుష్క పిక్స్ ను చూస్తే అది నిజమే అనిపిస్తుంది. భాగమతి తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన అనుష్క కోనా వెంకట్ నిర్మాణంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సైలెన్స్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో అనుష్కతో పాటుగా కోలీవుడ్ స్టార్ మాధవన్ నటిస్తాడని తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో ఓ హాలీవుడ్ స్టార్ కూడా ఉంటాడని వార్తలు వచ్చాయి. లేటెస్ట్ గా ఆ హాలీవుడ్ స్టార్ ఎవరో తెలిసింది. కిల్ బిల్ స్టార్ మైఖెల్ మాడ్సెన్ అనుష్క సినిమాలో నటిస్తున్నాడట. యూరప్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారట. నూతన దర్శకుడు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై చిత్రయూనిట్ ఫుల్ కాన్ ఫిడెంట్ గా ఉంది. సైలెంట్ గా ఈ సినిమా షూటింగ్ చేస్తున్నారని తెలుస్తుంది.





Untitled Document
Advertisements