బీఎస్పీకి 3 లోక్‌స‌భ‌, 21 అసెంబ్లీ స్థానాలు

     Written by : smtv Desk | Sun, Mar 17, 2019, 06:19 PM

బీఎస్పీకి 3 లోక్‌స‌భ‌, 21 అసెంబ్లీ స్థానాలు

ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీ ప్రభావం ఎవ్వరు ఊహించని రీతిలోనే ఉండబోతుందని పలువురు రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తునారు.ఇక్కడ ఉండే కొన్ని పార్టీలు పవన్ మాతో కలుస్తున్నారు..వారితో కలిసిపోయారు అని ఎన్నో రకాలుగా ప్రజలను జనసేన కార్యకర్తలను మభ్యపెట్టాలని ప్రయత్నించినా పవన్ తాను నడవబోయేది వామ పక్షాలతో తప్ప మరెవ్వరితోను కాదని తేల్చి చెప్పేసారు.

ఇటీవలే తాజాగా బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతితో జరిపిన భేటీ అనంతరం తాము రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కలిసి పోటీ చేయనున్నామని స్పష్టం చేసారు.ఈ రెండు పార్టీల మధ్య ఈ రోజు జరిగిన సమావేశంలో పొత్తులలో భాగంగా పవన్ బీఎస్పీ కి కొన్ని సీట్లను కేటాయించారు.లోక్ సభ స్థానాలు రెండు అలాగే అసెంబ్లీ స్థానాలకు వచ్చి మొత్తం 21 స్థానాలను కేటాయించామని అధికారికంగా వెల్లడించారు.ఇప్పటికే ఇతర వామపక్షాలు కూడా 20 దాటే సీట్లు అడుగుతున్నట్టు తెలుస్తుంది.వీరికి కూడా 21 స్థానాలు ఇచ్చారు.మరి ఈ అన్నిటిలో పవన్ ఎన్ని స్థానాలను గెలుపు దిశగా తిప్పుకుంటారో చూడాలి.





Untitled Document
Advertisements