జ‌గ‌న్‌కు ఓటు అడిగే హ‌క్కు లేదు

     Written by : smtv Desk | Mon, Mar 18, 2019, 12:02 PM

జ‌గ‌న్‌కు ఓటు అడిగే హ‌క్కు లేదు

ఏపీలో ఎన్నిక‌ల వార్ స్టార్ట్ అయ్యింది. ముఖ్యంగా ఈ ఎన్నిక‌ల్లో టీడీపీ, వైసీపీల మ‌ధ్యే ప్ర‌ధాన పోటీ ఉండ‌డంతో ఇరు పార్టీల నేత‌లు ఒక‌రి పై మ‌రొక‌రు విమ‌ర్శ‌లు దాడిని క్ర‌మంగా పెంచేస్తున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా టీడీపీ అధినేత ఆప‌ద్ధ‌ర్మ‌ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పై చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి.

టీడీపీ నేత‌ల‌తో ఏర్పాటు చేసిన టెలీకాన్ఫ‌రెన్స్‌లో మాట్లాడిన చంద్ర‌బాబు, వైఎస్ వివేకానంద‌రెడ్డి మ‌ర‌ణం త‌ర్వాత జ‌గ‌న్ కొత్త నాట‌కాల‌కు తెర‌లేపార‌ని, వివేకా హ‌త్య‌ను గుండేపోటుగా చిత్ర‌క‌రీంచడానికి జ‌గ‌న్ ప్లాన్ వేశార‌ని చంద్ర‌బాబు మండిప‌డ్డారు. ఇక‌ వివేకా ఎంపీగా ఉన్న‌ప్పుడు రాజీనామా చేయాల‌ని గ‌తంలో జ‌గ‌న్ బెదిరింపుల‌కు పాల్ప‌డ్డార‌ని, సిట్ విచార‌ణ‌లో మొత్తం బ‌య‌ట‌కు వ‌స్తాయ‌ని చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు.

ఎన్నిక‌ల యుద్ధానికి ముందే జ‌న‌గ్ స‌రెండ‌ర్ అయిపోయార‌ని, అస‌లు రాష్ట్రంలో జ‌గ‌న్‌కు ఓటు అడిగే హ‌క్కులేద‌ని చంద్ర‌బాబు ఫైర్ అయ్యారు. రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించ‌డానికి కేంద్రంలో మోదీతో, ప‌క్క‌రాష్ట్రంలో కేసీఆర్‌తో కుమ్మ‌క్కు అయిన‌ జ‌గ‌న్ ఆంధ్రుల ఆత్మ గౌర‌వాన్ని మంట‌గ‌లుపుతున్నార‌ని చంద్ర‌బాబు ద్వ‌జ‌మెత్తారు. ఇక జ‌గ‌న్ ఎన్ని కుట్ర‌లు చేసినా వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రోసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌ని చంద్ర‌బాబు ధీమా వ్య‌క్తం చేశారు. మ‌రి చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల పై వైసీపీ శ్రేణులు ఎలా స్పందిస్తారో చూడాలి.





Untitled Document
Advertisements