య‌ల‌మంచిలి ర‌వికి జనసేన భారీ ఆఫర్

     Written by : smtv Desk | Mon, Mar 18, 2019, 12:38 PM

య‌ల‌మంచిలి ర‌వికి  జనసేన భారీ ఆఫర్

అమరావతి, మార్చ్ 18: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సార్వ‌త్రిక ఎన్నిలు స‌మ‌రం మొద‌లైంది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు పూర్తి స్థాయిలో అభ్య‌ర్ధుల జాబితాను ప్ర‌క‌టించాయి. ఇక జ‌న‌సేన మాత్రం విడ‌త‌ల వారిగా అభ్య‌ర్ధుల జాబితాను ప్ర‌క‌టిస్తోంది. అయితే కాంగ్రెస్, బీజేపీలు మాత్రం ఇంకా అభ్య‌ర్ధుల జాబితాను ప్ర‌క‌టించ‌లేదు.

ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్ధుల జాబితా ప్ర‌క‌టించ‌గానే టిక్కెట్ ద‌క్క‌ని వారి నుండి ఆగ్ర‌హ జ్వాల‌లు చెల‌రేగుతున్నాయి. ఈ క్ర‌మంలో గ్యారెంటీగా టిక్కెట్ ద‌క్కుతుంద‌నుకున్న వైసీపీ నేత య‌ల‌మంచిలి ర‌వికి వైసీపీ న్యాయ‌కత్వం టిక్కెట్ ఇవ్వ‌లేదు.

దీంతో వైసీపీ అధిష్టానం పై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్న య‌ల‌మంచిలి ర‌వి ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న విజ‌య‌వాడ తూర్పు నుండి పోటీ చేసేందుకు స‌న్నాహాలు చేసుకుంటున్నారు. అయితే వైసీపీ హ్యాండ్ ఇవ్వ‌డంతో ఆయ‌న ఆ స్థానం నుండే స్వ‌తంత్రంగా పోటీ చేసేందుకు స‌న్నాహాలు చేసుకుంటున్నారు.

ఇక మ‌రోవైపు జ‌న‌సేన నుండి య‌ల‌మంచిలి ర‌వికి బంప‌ర్ ఆఫ‌ర్ వ‌చ్చింది. జ‌న‌సేన‌లో చేరితే ఆయ‌న‌కు విజ‌య‌వాడ తూర్పు నుండి టిక్కెట్ ఇస్తామ‌ని జ‌న‌సేన నుండి ఆఫ‌ర్ వ‌చ్చింది. మ‌రి జ‌న‌సేన ఇచ్చిన ఆఫ‌ర్ పై య‌ల‌మంచిలి ర‌వి సున్నితంగా తోసిపుచ్చార‌ని తెలుస్తోంది. జ‌న‌సేన నుండి పోటీ చేసినా, పెద్ద‌గా ఉప‌యోగం ఉండే అవ‌కాశం లేద‌ని భావించిన య‌ల‌మంచిలి ర‌వి జ‌న‌సేన ఆఫ‌ర్‌ను తిర‌స్క‌రించిన‌ట్లు తెలుస్తోంది. దీంతో ఆయ‌న విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుండి ఇండిపెండెంట్‌గానే పోటీ చేస్తాన‌ని సంచ‌ల‌న నిర్ణ‌యం తీఉకున్నార‌ని స‌మాచారం. దీంతో మ‌రి 25తో నామినేష‌న్ గ‌డువు పూర్తి కానున్న నేప‌ధ్యంలో య‌ల‌మంచిలి ర‌వి త‌న నిర్ణ‌యాన్ని మార్చుకుంటారో లేక ఇండిపెండెంట్‌గానే పోటీ చేస్తారో చూడాలి.





Untitled Document
Advertisements