కైకలూరులో ఎవరు గెలుపు ?

     Written by : smtv Desk | Mon, Mar 18, 2019, 12:48 PM

కైకలూరులో ఎవరు గెలుపు ?

గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తులో భాగంగా ఇక్కడ నుండి బీజేపీ తరుపున కామినేని శ్రీనివాస్ కైకలూరు నుండి గెలిచి మంత్రి అయ్యారు. అయితే ఏడాది క్రితం టీడీపీ కేంద్ర ప్రభుత్వం నుండి తప్పుకోవడంతో…రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం నుండి బీజేపీ తప్పుకుంది. దీంతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయలేనని ఆయన…రాజకీయాలు నుండి తప్పుకున్నారు. దీంతో టీడీపీ పోటీలోకి దిగుతుంది..మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ ఈ సారి ఎన్నికల్లో బరిలో నిలిచారు.


2009లో ఎమ్మెల్యేగా పని చేసిన జయమంగళకి కూడా నియోజకవర్గంపై మంచి పట్టు ఉంది. టీడీపీ ఇన్‌చార్జ్‌గా ఉంటూ ప్రభుత్వ పరంగా వచ్చే సంక్షేమ పథకాలని ప్రజలకి చేరువయ్యేలా చేశారు. అలాగే టీడీపీ కార్యకర్తలకి అందుబాటులో ఉంటూ పార్టీ పటిష్టతకి కృషి చేశారు. అయితే ప్రభుత్వం మీద వ్యతిరేకిత ఎక్కువగా ఉంది. వైసీపీ అభ్యర్ధి కూడా స్ట్రాంగ్‌గా ఉన్నారు. మరోవైపు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా దూలం నాగేశ్వరరావు బరిలో ఉన్నారు. ఆయన ఎప్పటి నుండో ప్రచారంలో దూసుకువెళ్ళుతున్నారు. ఇక గత ఐదేళ్లుగా నియోజకవర్గ సమన్వయకర్తగా వ్యవహరిస్తూ గ్రామ స్థాయి నుండి పార్టీ పటిష్ఠతకు డీఎన్నార్ తీవ్రమైన కృషి చేశారు.

ఇక ఇక్కడ జనసేన కూడా బలంగా ఉంది. జనసేన తరుపున బత్తిన నరసింహారావు దిగుతున్నట్లు సమాచారం. ఇక మాజీ మంత్రి కామినేని పరోక్ష మద్ధతు జనసేనకి ఉందని ప్రచారం జరుగుతోంది. కాగా, నియోజకవర్గంలో కాపు సామాజికవర్గంలో అత్యధిక ఓట్లు ఉండటంతో…వారు గెలుపోటములని ప్రభావితం చేసే అవకాశం ఉంది.





Untitled Document
Advertisements