“సాహో” లేటెస్ట్ అప్డేట్..!

     Written by : smtv Desk | Mon, Mar 18, 2019, 01:42 PM

 “సాహో” లేటెస్ట్ అప్డేట్..!

హైదరాబాద్, మార్చి 18: ఇప్పుడు భారతదేశం అంతటా గర్వించదగ్గ సినిమాల్లో మన తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి.వాటిలో “సాహో” కూడా ఒకటి. ప్రభాస్ హీరోగా శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా సుజీత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో యాక్షన్ ఈ చిత్రం తెరకెక్కుతుంది.ఈ సినిమాని ఇప్పటికే ఆగష్టు 15 న విడుదల చేస్తామని ప్రకటించేసారు.హాలీవుడ్ ప్రమాణాలతో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తవుతుంది.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ అంతిమ దశకు చేరుకుందని ఇంకా పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉందని ఇది వరకే చెప్పుకున్నాం.ఇప్పుడు తాజాగా ఈ సినిమా కోసం ఇంకో కొత్త అంశం బయటకు వచ్చింది.ఈ సినిమా షూటింగ్ కేవలం పాటలు మాత్రమే కాకుండా మరో కీలక యాక్షన్ బ్లాక్ కూడా బాకీ ఉందట.ఈ సినిమాలో మొత్తం మూడు పాటలు ఉన్నాయట.ఈ పాటలు మరియు ఈ యాక్షన్ ఎపిసోడ్ షూట్ పూర్తయితే ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లోకి దిగి అనుకున్న సమయానికి సినిమాని విడుదల చెయ్యాలని “సాహో” టీమ్ భావిస్తున్నారట.





Untitled Document
Advertisements