దేశవ్యాప్తంగా 11.4 లక్షల పాన్ కార్డులు రద్దు

     Written by : smtv Desk | Tue, Aug 08, 2017, 10:14 AM

దేశవ్యాప్తంగా 11.4 లక్షల పాన్ కార్డులు రద్దు

ముంబై, ఆగష్ట్ 8: నకిలీ పాన్ కార్డుదారుల భరతం పట్టే పనిలో కేంద్ర ప్రభుత్వం నిమగ్నమైంది. దీనిలో భాగంగా ఇటీవల ఆధార్‌కార్డును పాన్‌ కార్డుతో అనుసంధానం చేసుకోవాలని గతంలో ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు ఆగస్టు 31 ఆఖరి గడువుగా నిర్ణయించింది. అయితే తాజాగా దేశ వ్యాప్తంగా సుమారు 11.4 లక్షల పాన్ కార్డులను డీయాక్టివేట్ చేసింది. అందులో కొన్నింటిని డిలీట్ కూడా చేసింది. ఒకేవ్యక్తి పలు పాన్‌ నంబర్లు కల్గివుండటం, నకిలీ పాన్‌ కార్డులను నియంత్రించడంలో భాగంగా కేంద్రం ఈ చర్యలు చేపట్టింది.

తాజా చర్యలో డీయాక్టివ్‌ అయిన పాన్‌కార్డుల్లో మీకార్డు ఉందో లేదో తెలుసుకోవాలంటే ఇన్‌కం టాక్స్ డిపార్ట్ మెంట్ ఇ- ఫైలింగ్ వెబ్ సైట్‌‌కి లాగిన్ అయితే, అందులో Know Your Pan అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. దాని మీద క్లిక్‌ చేస్తే ఒక పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ అన్ని వివరాలను పూర్తి చేసి సబ్మిట్ క్లిక్ చేయాలి. మీ ఫోన్‌ నెంబర్‌కి పాస్‌వర్డ్ వస్తుంది. మీ పాన్ కనుక వాలిడ్ అయితే యాక్టివ్ అని చూపిస్తుంది.

ఒకవేళ ఆధార్‌తో పాన్‌ అనుసంధానం చేసుకోకపోతే డిసెంబర్‌ 2017 నాటికి పాన్‌ రద్దు కానుందని అధికారిక సమాచారం.





Untitled Document
Advertisements