రెండు వేర్వేరు సైజ్, డిజైన్లలో 500 రుపాయల నోట్లు?!

     Written by : smtv Desk | Tue, Aug 08, 2017, 04:02 PM

రెండు వేర్వేరు సైజ్, డిజైన్లలో 500 రుపాయల నోట్లు?!

న్యూఢిల్లీ, ఆగస్ట్ 8 : ప్రభుత్వం ప్రచురించిన కరెన్సీ నోట్లలో అవకతవకల గురించి ఎంపీ శరద్‌ యాదవ్‌ సభ దృష్టికి తీసుకురావడంతో రాజ్యసభలో పెద్ద చర్చకు దారి తీసింది. ప్రభుత్వం ఎందుకు నోట్లను రద్దు చేసిందో ఇప్పుడు అర్ధమవుతుంది. రెండు వేరు వేరు సైజ్, డిజైన్ లు ఉండేలా నోట్లను ముద్రిస్తున్నారంటూ కాంగ్రెస్ నేత క‌పిల్ సిబ‌ల్ విమర్శించారు. ఈ విషయంపై గులామ్ న‌బీ ఆజాద్ స్పందిస్తూ.. మేము కూడా పరిపాలించా౦ కానీ ఇలా ప్రభుత్వానికి, పార్టీకి రెండు రకాల నోట్లను ముద్రించలేద౦టూ ఆరోపించారు. కాగా సభలో ఎన్నో ముఖ్యమైన అంశాలను చర్చించాల్సి ఉన్నా కూడా కాంగ్రెస్ మాత్రం ఇలా క‌రెన్సీ నోట్లపై బాధ్యతారాహిత్యంగా మాట్లాడడం సరికాదని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ విమ‌ర్శించడంతో కాంగ్రెస్ నేత‌లంతా స‌భ‌లో ఆందోళ‌నకు దిగారు. తృణ‌మూల్ కాంగ్రెస్ నేత డైరెక్ట్ ఓబ్రైన్ కూడా కాంగ్రెస్ లేవ‌నెత్తిన అంశాన్ని స‌మ‌ర్థించారు. అయితే నోట్లలో స్వల్ప మార్పులు సాధారణమే అంటూ, ఆర్ధిక శాఖ స్పష్టం చేసింది.

Untitled Document
Advertisements