విక్రమ్‌ గౌడ్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి

     Written by : smtv Desk | Tue, Aug 08, 2017, 04:35 PM

విక్రమ్‌ గౌడ్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి

హైదరాబాద్, ఆగస్ట్ 8 : మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత ముఖేష్‌ గౌడ్ కుమారుడు విక్రమ్‌ గౌడ్ ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్నారు. తనపై తానే కాల్పులు జరుపుకున్న కేసులో భాగంగా విక్రమ్ ను ఒక రోజు పాటు విచారించడానికి నాంపల్లి కోర్టు అనుమతించడంతో బంజారాహిల్స్ పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. ఆయనతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ముగ్గురు నిందితులకు మాత్రం మూడురోజుల పోలీసు కస్టడీకి అనుమతినివ్వడంతో రేపటి నుంచి ఆ ముగ్గురిని పోలీసులు విచారించనున్నారు. కాగా విక్రమ్ గౌడ్ తన తండ్రి వద్ద నుంచి డబ్బు వసూలు చేసేందుకు తన మీద తానే కాల్పులు జరుపుకొని సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి కారణాలు ఇంకేమైనా ఉన్నాయా? అంటూ విచారించనున్నారు.

Untitled Document
Advertisements