సినిమా నచ్చక కేంద్రమంత్రికి ట్వీట్

     Written by : smtv Desk | Tue, Aug 08, 2017, 04:47 PM

సినిమా నచ్చక కేంద్రమంత్రికి ట్వీట్

పుణె, ఆగష్ట్ 8: ప్రస్తుత తరంలో ప్రజలు సామాజిక మాధ్యమ వేదికలను ఉపయోగించుకోవడంలో ఎంత ముందుగా ఉంటున్నారో ప్రత్యేకంగా తెలియజేయనవసరం లేదు. ఇటు విద్యార్థుల నుంచి అటు రాజకీయ నాయకుల వరకు అందరూ సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. మంచి-చెడు, న్యాయం-అన్యాయం, చిత్ర-విచిత్రాలను సామాజిక మాధ్యమ వేదికగా ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. తాజాగా పూణేకి చెందిన విశాల్ సూర్యవంశి చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ఇటీవల షారూఖ్‌, అనుష్క శ‌ర్మ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన 'జ‌బ్ హ్య‌రీ మెట్ సెజ‌ల్' చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా చూసేందుకు విశాల్ థియేటర్‌కి వెళ్ళాడు. సినిమా నచ్చక పోవడంతో అక్కడి నుంచి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌కి ట్వీట్ చేశాడు. స్వరాజ్ జీ ! నేను 'జబ్ హ్యారీ మెట్ సెజెల్' చిత్రం చూస్తున్నాను. వీలైనంత తొందరగా ఇక్కడ నుండి నన్ను బ‌య‌ట‌ప‌డేలా చేయండి అని సుష్మా స్వరాజ్‌ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. తమ అభిమాన హీరో సినిమాని కించపరచడానికే తను ఇలా చేశాడని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశాల్ సూర్య‌వంశీ ఇలా చేయడం చాలా కొత్తగా ఉందని కొందరు ట్వీట్స్ చేస్తున్నారు.

Untitled Document
Advertisements