ఆక్స్ ఫర్డ్ నిఘంటువులో మరో భారతీయ పదం

     Written by : smtv Desk | Fri, Mar 22, 2019, 08:19 AM

ఆక్స్ ఫర్డ్ నిఘంటువులో మరో భారతీయ పదం

భారతీయలంతా పిలుచుకునే చెడ్డీ‌స్‌ పదానికి ఆక్స్‌ఫోర్డ్ ఇంగ్లిష్ డిక్షనరీలో చోటు దక్కింది. చెడ్డీలతో పాటు జిబ్బన్స్, సితూతెరీ వంటి భారతీయ పదాలు, మాటలు 650 ఆక్స్ ఫోర్డ్ డిక్షనరీలో స్థానం సంపాదించుకున్నాయి. చెడ్డీస్ అనే పదానికి వివరణ ఇస్తూ ‘చిన్న పంట్లాములు, లాగూలు. ప్రస్తుతం వాడకంలో లోదుస్తులు’ అని బ్రిటిష్ వాడుక భాషలో చెడ్డీస్ పదాన్ని ఎలా వాడతారో ఒక వాక్యం ఉదాహరణగా ఇచ్చి అర్థం వివరించింది.

బ్రిటిష్ పాలనలో కూడా ఈ పదం పలు అధికార గెజిట్లు, ప్రచురణల్లో కనిపించింది. కాగా 1990లో బీబీసీలో వచ్చిన గుడ్‌నెస్ గ్రేషియస్ మీ అనే కామెడీ సిరీస్‌లో ఈ పదాన్ని వాడటంతో ఇది ప్రాముఖ్యత సాధించింది. చాలా మంది ఎక్కువగా ఈ చెడ్డీ అనే పదాన్ని వాడుతుంటారు. ఈ పదాన్ని డిక్షనరీలో చేర్చుతున్నట్లు ఆక్స్‌ఫోర్డ్ ఇంగ్లిష్ డిక్షనరీ సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్ జొనాథన్ డెంట్ పేర్కొన్నారు. ఈ డిక్షనరీలో చడ్డీస్ అన్న పదానికి షార్ట్ ట్రౌజర్స్, షార్ట్స్ అని అర్థం చెప్పారు.

చెడ్డీలు అన్న పదాన్ని మొట్ట మొదటి సారి 1858లో బ్లాక్‌వుడ్‌కు చెందిన ఎడిన్‌బర్గ్ మ్యాగజైన్‌లో వాడినట్లు ఆక్స్‌ఫోర్డ్ వెల్లడించింది. 1885 గెజటీర్ బాంబే ప్రెసిడెన్సీలోనూ ఈ పదాన్ని వాడినట్లు పేర్కొంది. పురుషులు మోకాళ్ల వరకు ఉండే ఈ చెడ్డీలను ధరిస్తారని అందులో పేర్కొన్నారు. ఆక్స్‌ఫోర్డ్ ఇంగ్లిష్ డిక్షనరీ ప్రతి ఏడాది నాలుగు సార్లు మార్పులు చేర్పులు చేసుకుంటుంది. కొత్త పదాలు, మాటలతో పాటుగా ప్రస్తుతం ఉన్న పదాలకు కొత్త అన్వయాలను కూడా చేరుస్తారు. కొత్తగా చేర్చిన పదాల్లో కొన్ని నిజానికి చాలా పాతవి. వాటికి పాత సంపుటాలలో గుర్తింపు దక్కలేదు. ఆక్స్‌ఫోర్డ్ ఇంగ్లిష్ డిక్షనరీ ఏడాదిలో మార్చి, జూన్, సెప్టెంబర్, డిసెంబర్‌లలో నాలుగుసార్లు అప్‌డేట్ అవుతుంది.





Untitled Document
Advertisements