సిపిఎం ఆఫీసులో రేప్

     Written by : smtv Desk | Fri, Mar 22, 2019, 10:40 AM

సిపిఎం ఆఫీసులో రేప్

పాలక్కాడ్: కేరళలోని చెరుప్లాస్సెర్రీలో ఉన్న అధికార సిపిఎం పార్టీ ఏరియా కమిటీ కార్యాలయంలో ఏడాది క్రితం తనపై అత్యాచారం జరిగిందని 21 ఏళ్ల యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు దీనిపై దర్యాప్తు ప్రారంభించారు. గత శనివారం రోడ్డపక్కన ఒక నవజాత శిశువు కనిపించడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఆ శిశువు తల్లి జాడ కనిపెట్టారు. పది నెలల క్రితం తనపై సిపిఎం కార్యలయంలోపల ఒ విద్యార్థి నాయకుడు తనపై ఆత్యాచారం చేశాడని ఆమె ఆరోపించినట్లు పోలీసులు తెలిపారు. ఒక కాలేజి మ్యాగజైన్‌ను రూపొందించే సన్నాహంలో భాగంగా తాను పార్టీ కార్యాలయానికి వెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగినట్లు ఆ యువతి తన ఫిర్యాదులో ఆరోపించింది.

కాగా ఆ యువతి ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్త అని, ఆమె కుటుంబానికి పార్టీతో సన్నిహిత సంబంధాలున్నాయని స్థానిక సిపిఎం నాయకుడొకరు చెప్పారు. పార్టీ ఆఫీసులో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు పార్టీ దర్యాప్తు జరుపుతుందని, పోలీసులు కూడా వాస్తవమైన, శాస్త్రీయమైన దర్యాప్తు జరపాలని కూడా ఆయన అన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి స్టేట్‌మెంట్‌ను పోలీసులు ఇప్పటిదాకా రికార్డు చేయలేదు. కాగా యువతిని, శిశువును ఆస్పత్రిలో చేర్పించినట్లు పోలీసులు తెలిపారు. కాగా సిపిఎం కార్యాలయాలు రేప్ కేంద్రాలుగా మారుతుండడం దురదృష్టకరమని, ఎల్‌డిఎఫ్ పాలనలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఈ సంఘటనపై సందిస్తూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రమేష్ చెన్నితల అన్నారు. ఈ సంఘటనను నిరసిస్తూ యువజన కాంగ్రెస్ కార్యకర్తలు స్థానిక సిపిఎం కార్యాలయం ముందు ధర్నా చేసి పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.





Untitled Document
Advertisements