జనంపైకి దూసుకెళ్లిన కారు : ఆరుగురు మృతి

     Written by : smtv Desk | Fri, Mar 22, 2019, 01:39 PM

జనంపైకి దూసుకెళ్లిన కారు : ఆరుగురు మృతి

బీజింగ్ : చైనాలో శుక్రవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది.. సెంట్రల్‌ చైనాలో జనంపైకి కారు దూసుకుపోయింది. సెంట్రల్‌ చైనా హుబీ ప్రొవిన్స్‌లోని జావోయాంగ్‌ నగరంలో జరిగిన ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. వేగంగా వచ్చిన ఓ కారు జన సమూహంపైకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. అప్రమత్తమైన పోలీసులు కాల్పులు జరపడంతో ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ కూడా మృతి చెందాడు. ఇటీవలి కాలంలొో ఈ తరహా ఘటనలు చైనాలో జరుగుతున్నాయి. అయితే ఈ ఘటనలో ఉగ్ర కోణం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఘటనపై ఉగ్ర దాడి కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియరాలేదని పోలీసులు వెల్లడించారు.

Untitled Document
Advertisements