ఇక్కడ 'మీటూ'...జపాన్ లో 'కూటూ' ఉద్యమాలు

     Written by : smtv Desk | Fri, Mar 22, 2019, 09:04 PM

ఇక్కడ 'మీటూ'...జపాన్ లో 'కూటూ' ఉద్యమాలు

మార్చ్ 22: 'మీటూ' అంటే తెలియని వారు ఎవ్వరూ ఉండరు. ఈ ఉద్యమం ఇక్కడ ఎంత దుమారం లేపుతోందో తెలిసిందే. అయితే ఇదే తరహాలో జపాన్‌ లో మరో ఉద్యమం ఉపందుకుంది. మహిళా ఉద్యోగులకు హైహీల్స్ తో పాటు డ్రెస్ కోడ్ నిబంధన విధించడంపై 'కూటూ' ఆన్‌లైన్ ఉద్యమం పురుడు పోసుకుంది. కార్యాలయాల్లో పనిచేస్తున్న స్త్రీ, పురుషుల మధ్య తేడాలెందుకని జపాన్ మహిళలు ప్రశ్నించారు. సూట్ తోపాటు హైహీల్స్ ఎందుకు ధరించాలంటున్నారు. హైహీల్స్ ధరించడం వల్ల మహిళల పాదాలకు రక్తప్రసరణ సరిగా జరగదని.. కాళ్లకు గాయాలయ్యే ప్రమాదముందుంటూ ట్వీట్‌ వార్‌ చేస్తున్నారు.





Untitled Document
Advertisements