బ్రేకింగ్ : ‘ఓలా’ క్యాబ్‌లపై 6 నెలల బ్యాన్ !

     Written by : smtv Desk | Sat, Mar 23, 2019, 07:50 AM

బ్రేకింగ్ : ‘ఓలా’ క్యాబ్‌లపై 6 నెలల బ్యాన్ !

బెంగళూరు: ప్రముఖ క్యాబ్ సర్వీసెస్ సంస్థ ‘ఓలా’కు కర్నాటకలో ఎదురుదెబ్బ తగిలింది. ఆరు నెలలపాటు ఓలా క్యాబ్‌లను నడపరాదంటూ ఆ రాష్ట్ర రవాణా శాఖ ఆదేశించింది. నిబంధనలను అతిక్రమించినందుకుగాను ఆ సంస్థ లైసెన్స్‌లను ఆరు నెలలు రద్దు చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఓలా సంస్థ ఈ మధ్య కాలంలో ద్విచక్ర వాహన సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చిన విషయం తెలసిందే. అయితే, ఈ విషయంలో నిబంధనలకు వ్యతిరేకంగా ఓలా సంస్థ వ్యవహరించిందని తన ప్రకటనలో పేర్కొంది. దీనిపై ఓలా సంస్థను వివరణ కోరింది. కాగా, ఆ సంస్థ ఇచ్చిన లిఖిత పూర్వక వివరణ రవాణా శాఖ అధికారులను సంతృప్తిపరచలేకపోయింది. దాంతో ఆరునెలల పాటు ఓలా సంస్థకు చెందిన వాహనాలు కర్నాటకలో నడపరాదంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో కర్నాటకలో ఆరు నెలలు ఈ సంస్థ సర్వీసులు నిలిచిపోనున్నాయి.





Untitled Document
Advertisements