డియర్ కామ్రేడ్.. బిజినెస్ అదిరింది..!

     Written by : smtv Desk | Sat, Mar 23, 2019, 08:04 AM

డియర్ కామ్రేడ్.. బిజినెస్ అదిరింది..!

విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా భరత్ కమ్మ డైరక్షన్ లో వస్తున్న సినిమా డియర్ కామ్రేడ్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా నుండి ఈమధ్య వచ్చిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. మే 31న రిలీజ్ ప్లాన్ చేసిన డియర్ కామ్రేడ్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదరగొడుతుంది. ఇప్పటికే ఈ సినిమా నైజాం, సీడెడ్ ఏరియాలు కలిపి 11 కోట్లకు కొనేశారట. నైజాం ఏషియన్ సునీల్ నారంగ్ ఈ సినిమాను కొన్నారట.

ఇక ఆంధ్రాలో కూడా డియర్ కామ్రేడ్ 10 కోట్ల దాకా బిజినెస్ చేసిందని తెలుస్తుంది. ఇది కాకుండా ఓవర్సీస్ రైట్స్ ఎంతన్నది తెలియాల్సి ఉంది. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. సో అన్ని భాషల్లో కలిపి ఎలా లేదన్నా 40 నుండి 50 కోట్ల దాకా బిజినెస్ చేసే అవకాశం ఉంది. మరి డియర్ కామ్రేడ్ బిజినెస్ అదరగొట్టగా రిలీజ్ తర్వాత వసూళ్ల హంగామా ఎలా ఉంటుందో చూడాలి.





Untitled Document
Advertisements