భారత్ సైన్యాన్ని కించపరిచేలా మాట్లాడటం సిగ్గుచేటు

     Written by : smtv Desk | Sat, Mar 23, 2019, 08:12 AM

భారత్ సైన్యాన్ని కించపరిచేలా మాట్లాడటం సిగ్గుచేటు

సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా జాతీయ రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు బీజేపీపై విరుచుకు పడితే.. బీజేపీకి చెందిన నేతలు కాంగ్రెస్ పార్టీపై మండిపడుతున్నారు. ఏమాత్రం వెనక్కి తగ్గేదే లేదన్నట్లుగా.. ఆయా నాయకుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. పాకిస్థాన్‌లోని బాలాకోట్‌పై భారత వాయుసేన జరిపిన దాడులను తప్పు పడుతూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శామ్‌ పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. భారత్ సైన్యాన్ని కించపరిచేలా మాట్లాడటం సిగ్గుచేటని వివరించారు. శామ్‌ పిట్రోడా వ్యాఖ్యలపై స్పందిస్తూ... మోడీ వరుస ట్వీట్లతో చెలరేగిపోయారు.

మోడీ ఏమన్నారంటే.. 'ఉగ్రదాడికి దీటుగా బదులివ్వడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదు. ఇప్పుడు ఆ విషయాన్ని కాంగ్రెస్‌ రాజకుటుంబానికి అత్యంత విశ్వసనీయమైన వ్యక్తి కూడా ఒప్పుకున్నారు. ఉగ్రవాదుల పక్షాన మాట్లాడటం, మన సాయుధ బలగాలను ప్రశ్నించడం విపక్షాలకు అలవాటుగా మారింది. దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేస్తున్న జవాన్లను ప్రతిపక్ష నేతలు పదే పదే అవమానిస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిని ఈ దేశ ప్రజలు క్షమించరు' అని మోడీ హెచ్చరించారు.





Untitled Document
Advertisements