నందమూరి హీరో తుగ్లక్ అవుతున్నాడు..!

     Written by : smtv Desk | Sat, Mar 23, 2019, 09:50 AM

నందమూరి హీరో  తుగ్లక్ అవుతున్నాడు..!

నందమూరి హీరో కళ్యాణ్ రాం 118 సినిమా సూపర్ హిట్ కొట్టడంతో కెరియర్ లో మంచి జోష్ నింపుకున్నాడు. 118 తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరో సినిమా చేస్తున్నాడు కళ్యాణ్ రాం. నూతన దర్శకుడు మల్లిడి వేణు డైరక్షన్ లో కళ్యాణ్ రాం సినిమా ఉంటుందని తెలుస్తుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మిస్తారని తెలుస్తుంది.

ఫాంటసీ కథతో రాబోతున్న ఈ సినిమా బడ్జెట్ కూడా భారీగా ఉంటుందని తెలుస్తుంది. కళ్యాణ్ రాం కన్నా ముందే అల్లు శిరీష్ తో మల్లిడి వేణు సినిమా చేయాల్సి ఉన్నా అది ఎందుకో వెనక్కి వెళ్లింది. ఇక ఈ సినిమాకు టైటిల్ గా తుగ్లక్ అని పెట్టే ఆలోచనలో ఉన్నారట. ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో తుగ్లక్ టైటిల్ రిజిస్టర్ కూడా చేయించారట. కెరియర్ లో ఇప్పటివరకు సోషియో ఫాంటసీ సినిమాల జోలికి వెళ్లని కళ్యాణ్ రాం మొదటిసారి ఆ ప్రయత్నాన్ని చేస్తున్నాడు. కళ్యాణ్ రాం చేస్తున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ డీటైల్స్ ఏంటన్నది త్వరలో తెలుస్తుంది.

Untitled Document
Advertisements