కన్నడ నటి శారద కన్నుమూత

     Written by : smtv Desk | Sat, Mar 23, 2019, 05:37 PM

కన్నడ నటి శారద కన్నుమూత

ఈ మధ్య కాలంలో వరుసగా సినీ ఇండస్ట్రీలోని గొప్ప గొప్ప వాళ్ళు , ఒక్కొక్కరుగా భువినుండి దివికేగిపోతున్నారు. ఇప్పటికే పలువురు తెలుగు టాప్ కమెడియన్స్ మరణించారు.అలాగే ఈ మద్యే తెలుగు స్టార్ డైరెక్టర్ కోడిరామకృష్ణ గారు తీవ్ర అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు ఆయనను గచ్చిబౌలిలోని ఆసుపత్రికి తరలించగా ఆరోగ్య పరిస్థితి విషమించి ఆయన చనిపోయారు. అయన మరణ వార్త ని ఇంకా మరచిపోకముందే ఈ రోజు మరోనటి మృతి చెందటం తో సినీ పరిశ్రమ తీరని శోకంలో మునిగిపోయింది.

ప్రముఖ శాండిల్ వుడ్ నటి ఎల్‌.వి. శారదా గురువారం బెంగళూరులో తుదిశ్వాస విడిచింది. ఈమె ఫణియమ్మ, వంశవృక్ష లాంటి ప్రజాధరణ పొందిన కన్నడ సినిమాలలో నటించిన మంచి గుర్తింపుని తెచ్చుకుంది. ఈమె చిన్నతనం నుండి నటనలో ఉండే ఆసక్తితో పలు రకాలైన ప్రోగ్రామ్స్ లలో నటిస్తూ ఉండేది.

నటనపై ఉండే ఆసక్తితోనే సినీ ఇండస్ట్రీలోకి వచ్చింది. ఆలా ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లోనే తనదైన నటనతో అందరిని మెప్పించింది. ఆ తరువాత కన్నడ స్టార్స్ నడుమ నటించే ఛాన్స్ కూడా చేజిక్కించుకుంది. ఈవిధంగా శారదా కన్నడ సినీ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. ఇకపోతే ఈమె గత కొన్ని రోజులుగా శ్వాసకోస సమస్యతో బాధపడుతుంది.

ఈ నేపథ్యంలో సమస్య ఎక్కువ కావడంతో, హుటాహుటిన కుటుంబ సభ్యులు ఆమెని నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి లో జాయిన్ చేసారు. కానీ అప్పటికే తీవ్రత ఎక్కువ కావడంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస వదిలినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆదిశంకరాచార్య, భూతయ్యన మగ తో పాటు పలు కన్నడ సినిమాలలో శారద ప్రముఖ పాత్రలు పోషించారు.

శారద మృతి పట్ల శాండిల్‌వుడ్‌కు చెందిన నటులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. చలనచిత్ర వాణిజ్య మం డలి అధ్యక్షులు చెన్నేగౌడతో పాటు సభ్యులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దర్శకులు, నిర్మా తలతో పాటు క్యారెక్టర్‌ నటులు శారద మృతి పట్ల సానుభూతి వ్యక్తం చేశారు.





Untitled Document
Advertisements