'కళంక్' లో కైరా కేక పుట్టిస్తుంది

     Written by : smtv Desk | Sat, Mar 23, 2019, 09:10 PM

'కళంక్' లో కైరా  కేక పుట్టిస్తుంది

బాలీవుడ్‌ నటులు వరుణ్‌ధావన్‌, ఆదిత్యారాయ్‌ కపూర్‌, ఆలియా భట్‌, మాధురీ దీక్షిత్‌, సోనాక్షి సిన్హా, సంజయ్‌ దత్‌ మెయిన్ రోల్స్ లో నటించిన సినిమా 'కళంక్‌'. ఈసినిమాను అభిషేక్‌ వర్మన్‌ దర్శకత్వం వహించారు. కరణ్‌ జోహార్‌, సాజిద్‌ నదియాద్‌వాలా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈసినిమా కోసం ప్రీతమ్‌ బాణీలు సమకూర్చారు. ఏప్రిల్‌ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.



అయితే ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఈ మధ్య రిలీజ్ చేసిన టీజర్ ప్రేక్షకులను ఆసక్తి రేపుతుంది. అలాగే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి స్పెషల్ సాంగ్ ను రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ఇందులో వరుణ్‌తో కలిసి నటి కైరా అడ్వాణీ డ్యాన్స్ సూపర్బ్ అనిపిస్తున్నాయి. ఆమె డ్యాన్స్‌, హావభావాలకు విశేషమైన స్పందన వస్తోంది. 'ఫస్ట్‌ క్లాస్‌' అని సాగే ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో ఆరో స్థానంలో కొనసాగుతుంది. కైరా తన డ్యాన్స్‌తో అదరగొట్టారంటూ నెటిజన్లు కామెంట్లు గుప్పిస్తున్నారు. పలువురు ప్రముఖులు కూడా కైరాను ప్రశంసిస్తూ ట్వీట్లు చేశారు. కాగా ఈ బాలీవుడ్ భామ తెలుగులో మహేశ్ నటించిన భరత్ అనే నేను సినిమాలో నటించిన విషయం తెలిసిందే.





Untitled Document
Advertisements