వార్నర్ 40వ హాఫ్ సెంచరీ.. భారీ స్కోర్ దిశగా హైదరాబాద్

     Written by : smtv Desk | Sun, Mar 24, 2019, 05:22 PM

వార్నర్  40వ హాఫ్ సెంచరీ..  భారీ స్కోర్ దిశగా హైదరాబాద్

టాస్ గెలిచిన కోల్‌కత్తా కెప్టెన్ దినేశ్ కార్తీక్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో నిలకడగా బ్యాటింగ్ చేశారు ఇద్దరూ దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో 11 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా వంద పరుగులు చేసింది హైదరాబాద్ జట్టు. ముఖ్యంగా బాల్ ట్యాంపరింగ్ వివాదం కారణంగా ప్రొఫెషనల్ క్రికెట‌్‌కు దూరమైన డేవిడ్ వార్నర్ వస్తూనే అదరగొట్టాడు. బ్యాన్ తర్వాత రీఎంట్రీ ఇస్తూనే అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడీ ఆసీస్ బ్యాట్స్‌మెన్. ఐపీఎల్‌లో అతనికి ఇది 40వ హాఫ్ సెంచరీ కావడం విశేషం.

ఐపీఎల్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన క్రికెటర్‌గా తన రికార్డును మెరుగుపరుచుకున్నాడు వార్నర్. వార్నర్ 40 హాఫ్ సెంచరీలతో ఉండగా, బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ 38 హాఫ్ సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు. గంభీర్, రైనా 36 హాఫ్ సెంచరీలతో మూడో స్థానంలో ఉన్నారు.

Untitled Document
Advertisements