ఈ కామర్స్‌ బిజినెస్‌ నుంచి తప్పుకోనున్న పేటిఎం!

     Written by : smtv Desk | Sun, Mar 24, 2019, 05:30 PM

ఈ కామర్స్‌ బిజినెస్‌ నుంచి తప్పుకోనున్న పేటిఎం!

మార్చ్ 24: ఈ వాలెట్‌ సంస్థ పేటిఎం మరో సంచలన నిర్ణయం తీసుకోనుందని సమాచారం. పేటిఎం ఈ కామర్స్‌ బిజినెస్‌ నుంచి తప్పుకొనేందుకు సిద్దమవుతోందని బిజినెస్‌ వర్గాలు నుంచి టాక్‌ వినిపిస్తుంది. ఈ సంస్థ 2017లో పేటిఎం మాల్‌ పేరుతో ఈ-కామర్స్‌ సర్వీసులను ప్రారంభించింది. దీనికోసం 2018లో రూ.2900కోట్ల సమీకరించింది. ఆ సంస్థకు ఈ-కామర్స్‌ బిజినెస్‌ అచ్చి రాక భారీ నష్టాలను చవిచూస్తూ వస్తోంది. పేటిఎం ఈ కామార్స్‌నుంచి తప్పుకోవడానికి ప్రధాన కారణం విక్రయం కానీ ఇన్వెంటరీ. ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్లు కొరత వలన రూ.150-రూ.160కోట్ల ఇన్వెంటరీ పేటిఎం సెల్లర్లు దగ్గర పేరుకుపోవడంతో వారు లబోదిబోమంటున్నారుఈ-కామర్స్‌ బిజినెస్‌ నుంచి తప్పుకుంటున్నట్లు వచ్చిన వార్తను కొట్టిపారేశారు. ప్రస్తుతం కంపెనీ స్థూల మర్చండైజ్‌ వ్యాల్యూమ 2 బిలియన్‌ డాలర్లకు పెరిగిందని తెలిపారు. అయితే పేటిఎం మాల్‌ కార్యాకలాపాల విషయమై కంపెనీ సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ ఇప్పటికే పలుమార్లు సమావేశమైనప్పటికీ బిజినెస్‌ మార్గాలు తెలిపాయి.

Untitled Document
Advertisements