ఏఐఎంపీఎల్‍‌బీ అత్యవసర భేటి

     Written by : smtv Desk | Sun, Mar 24, 2019, 06:41 PM

ఏఐఎంపీఎల్‍‌బీ అత్యవసర భేటి

లక్నో, మార్చ్ 24: అయోధ్య రామజన్మభూమి-బాబ్రి మసీదు భూమి వివాదంపై చర్చించేందుకు తాజాగా లక్నోలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వర్కింగ్ కమిటీ అత్యవసరంగా సమావేశమైంది. ఈ సమావేశంలో 51 మంది సభ్యులతో పాటు, సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఇప్పటికే అయోద్య అంశంపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన మధ్యవర్తుల కమిటీ పలువురి అభిప్రాయాలను తెలుసుకుంది. ఇక ఇవాళ భేటీ అయిన ఏఐఎంపీఎల్‍‌బీ తమ అభిప్రాయాలను ప్రత్యేక బెంచ్‌ కు తెలపనుంది.

Untitled Document
Advertisements