ఆపకుండా 6 గంటలు శృంగారం...మృత్యువాత పడ్డ మహిళ

     Written by : smtv Desk | Sun, Mar 24, 2019, 08:37 PM

ఆపకుండా 6 గంటలు శృంగారం...మృత్యువాత పడ్డ మహిళ

కొలంబియ, మార్చ్ 24: కొంత మంది ఎక్కువసేపు శృంగారంలో పాల్గొనేందుకు అనేక మత్తు పదార్థాలు, వివిధ రకాల మందులు వాడుతూ ఉంటారు. అయితే అప్పుడప్పుడు అవి వికటిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. ఇదే తరహాలో ఓ మహిళ తన భాగస్వామిపై తీసుకు వచ్చిన వత్తిడి కారణంగా చివరికి ఆమె ప్రాణాలే పోయాయి. పూర్తి వివరాల ప్రకారం కొలంబియాకు చెందిన 32 ఏళ్ల మహిళ తన పార్టనర్‌తో ఎంజాయ్ చేయానలనుకుంది. అయితే అందుకోసం వారు డ్రగ్స్ తీసుకొని శృంగారం ప్రారంభం చేశారు. అలా చేస్తూ చేస్తూ వారు 6 గంటలు అలాగే కొనసాగించారు. అయితే అలా చేస్తూ వుండగానే ఆమె మైకంలోకి వెళ్లిపోయింది. అతడు ఎంత తట్టినా ఆమెలో స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చిన అతడు కంగారుతో ఆమెను ట్యాక్సీలో ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆమెను పరీక్షించిన వైద్యులు విపరీతమైన శృంగారం, డ్రగ్స్ తీసుకోవడంతో ఆమె గుండె ఆగిపోయి మరణించిందని ధృవీకరించారు. మిత శృంగారం ఎంత ఆరోగ్యమో అతి శృంగారం అంత అనర్థదాయకం అనేది ఈ ఘటన ద్వారా తెలుసుకోవచ్చు.





Untitled Document
Advertisements