బ్రెగ్జిట్ ఒప్పందం మళ్లీ రిఫరెండం!

     Written by : smtv Desk | Sun, Mar 24, 2019, 09:12 PM

బ్రెగ్జిట్ ఒప్పందం మళ్లీ రిఫరెండం!

లండన్, మార్చ్ 24: బ్రెగ్జిట్ ఒప్పందం పార్లమెంట్ ముందుకు రానున్న సందర్భంగా జనాలు ఈయూ జెండాలు, ప్లకార్డులు పట్టుకుని రోడ్లపై తమ నిరసనలు తెలిపారు. ఇదివరకే రెండు సార్లు పార్లమెంట్‌ తిరస్కరణకు గురైన బ్రెగ్జిట్‌ ఒప్పందంపై వచ్చేవారంలో మూడో ఓటింగ్‌ ఉండే అవకాశాలున్నాయి. ఈ ఒప్పందాన్ని ఆమోదిస్తే బ్రెగ్జిట్‌ గడువును పొడిగించే అంశాన్ని పరిశీలిస్తామంటూ యురోపియన్ యూనియన్లు ప్రతిపాదించారు. రెండు సార్లు ఓటమికి గురైన ఈ ఒప్పందం విషయంలో తీసుకునే చర్యలపై స్పష్టత ఇవ్వాలంటూ ఎంపిల నుండి ఎదురవుతున్న వత్తిడికి తలోగ్గిన ప్రభుత్వం వచ్చే వారం ఓటింగ్‌ నిర్వహించేందుకు సిద్ధమైంది.





Untitled Document
Advertisements