కోటలో అంబరాన్న౦టిన సంబురాలు..

     Written by : smtv Desk | Tue, Aug 15, 2017, 05:44 PM

కోటలో అంబరాన్న౦టిన సంబురాలు..

హైదరాబాద్, ఆగస్ట్ 15 : గోల్కొండ కోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సంబరాలు అంబరాన్నంటాయి. "తకిటతకిటతక" అన్న శబ్దం వినిపిస్తున్న వేళ తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో వివిధ కళా రూపాలకు చెందిన కళాకారులు నినాదాలతో హోరెత్తించారు.

అంతేకాకుండా, డప్పులు, చిందు యక్షగానం, దాండియా, భాంగ్రా, గుస్సాడి, రాజన్నడోలు, లంబాడా, కొమ్ముకోయ, రాజకోయ, నగారాలు, రాజస్థానీ, మాధురి, అల్ఫా, కవ్వాలీ, పేరిణీ, లాస్యం, కూచిపూడి, పన్నెండు మెట్ల కిన్నెర వంటి తదితర కళా రూపాలు ఒక్కసారిగా ప్రజలకు అందించే ప్రయత్నం చేసారు.

ఇలా ఒక్కో నైపుణ్యాన్ని జాయింట్ స్క్రీన్స్ పై కెమెరాలు చూపిస్తు౦డగా కన్నుల పండుగగా కనిపించింది. ఈ కార్యక్రమంలో సుమారు 1000 మంది కళాకారులు తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.

Untitled Document
Advertisements