దాని కన్నా కబీర్ సింగ్ బాగుంది : ప్రభాస్

     Written by : smtv Desk | Sun, Apr 14, 2019, 03:54 PM

దాని కన్నా కబీర్ సింగ్ బాగుంది : ప్రభాస్

తెలుగులో సంచలనం సృష్టించిన అర్జున్ రెడ్డి సినిమా హిందీలో కబీర్ సింగ్ గా రిమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో షాహిద్ కపూర్ హీరోగా కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తున్నారు. తెలుగులో డైరెక్ట్ చేసిన సందీప్ వంగనే హిందీలోను డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్ కు ఊహించని రెస్పాండ్ వస్తుంది. తెలుగు అర్జున్ రెడ్డికి ఏమాత్రం తీసుపోనట్టుగా సందీప్ దీన్ని తెరకేక్కిస్తున్నాడు అనేది పూర్తిగా అర్థమవుతుంది. అయితే ఈ సినిమా టీజర్ చూసిన యాంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అర్జున్ రెడ్డి కంటే కబీర్ సింగ్ లుక్స్ ఇంకా చాల బాగున్నాయి అంటూ స్పందించాడు. ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్లో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ప్రభాస్ సాహో సినిమాతో యమ బిజీ అయిపోయాడు. ఇక అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ హీరోగా, షాలిని పాండే హీరొయిన్ గా నటించారు.

Untitled Document
Advertisements