ధోనీపై నిషేధం విధిస్తే అలాంటి తప్పులు మళ్ళీ జరగవు : సెహ్వాగ్

     Written by : smtv Desk | Sun, Apr 14, 2019, 05:18 PM

ధోనీపై నిషేధం విధిస్తే అలాంటి తప్పులు మళ్ళీ జరగవు : సెహ్వాగ్

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీపై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ధోని ఈ మధ్య రాజస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో అంపైర్లతో వివాదం పెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై సెహ్వాగ్ స్పందిస్తూ...‘ధోనీ పెద్ద తప్పు చేసినా.. చిన్న జరిమానాతో బయటపడిపోయాడు. కానీ.. ధోనీపై కనీసం రెండు మూడు మ్యాచ్‌ల్లో నిషేధం విధించి ఉండాల్సింది. ఎందుకంటే.. ఈరోజు ఈ విషయాన్ని ఉదాసీనంగా వదిలేస్తే..? రేపు ఇంకో జట్టు కెప్టెన్ ఇలాంటి తప్పిదానికే పాల్పడతాడు. అప్పుడు అంపైర్లకి విలువేముంటుంది..? అలాకాకుండా.. ధోనీపై నిషేధం విధిస్తే.. అలాంటి తప్పులు చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయో..? అందరికీ తెలుస్తుంది. అయినా.. ధోనీ అలా మైదానంలోకి వెళ్లి ఉండకూడదు. అసలు ఏం జరిగిందో..? తెలుసుకునేందుకు బౌండరీ లైన్ వెలుపల ఫోర్త్ అంపైర్ అందుబాటులో ఉన్నాడు. మరోవైపు పిచ్ వద్ద ఇద్దరు చెన్నై బ్యాట్స్‌మెన్‌లు చర్చిస్తున్నారు. మరి ఎందుకు ధోనీ వెళ్లినట్లు..? ఒకవేళ టీమిండియా కోసం ధోనీ ఇలా తాపత్రయపడింటే నేను చాలా సంతోషించేవాడ్ని. కానీ.. అతను భారత్ కెప్టెన్‌గా ఉన్న ఏ రోజూ కూడా ఈ తరహాలో జట్టు కోసం కోపం తెచ్చుకోలేదు. కానీ.. చెన్నై టీమ్‌ కోసం ఎక్కడలేని ఎమోషన్ వచ్చింది’ అని సెహ్వాగ్ మండిపడ్డాడు. గతంలోనూ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఫిక్సింగ్‌‌లో ఇరుక్కున్నప్పుడు ధోనీపై కూడా ఆరోపణలు వచ్చాయి. ఆ ఫిక్సింగ్‌ల కారణంగానే రెండేళ్లు నిషేధాన్ని కూడా చెన్నై టీమ్ ఎదుర్కొన్న విషయం తెలిసిందే.





Untitled Document
Advertisements