బిజెపి కార్యాలయాలు ధ్వంసం!

     Written by : smtv Desk | Mon, Apr 15, 2019, 01:49 PM

బిజెపి కార్యాలయాలు ధ్వంసం!

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బిజెపి పార్టీకి చెందిన మూడు కార్యాలయాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. బిజెపి కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి.. జెండాలను చింపేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనతో బిజెపి కార్యాలయాల వద్ద పోలీసులు భారీ భద్రతా ఏర్పాటు చేశారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బెంగాల్‌కు పారా మిలటరీ బలగాలను పంపాలని బిజిపి జనరల్ సెక్రటరీ కైలాష్ విజయ్‌వర్గీయ ఎన్నికల కమిషన్‌ను కోరారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని కైలాష్ విజ్ఞప్తి చేశారు.

Untitled Document
Advertisements