రెండున్నరేళ్లలో 30 కోట్ల యూజర్స్

     Written by : smtv Desk | Mon, Apr 15, 2019, 03:45 PM

రెండున్నరేళ్లలో 30 కోట్ల యూజర్స్

న్యూఢిల్లీ: టెలికాం రంగ దిగ్గజం రిలియన్స్ జియో ఓ రికార్డు సాధించింది. ఈ కంపెనీ టెలికం సేవలు ప్రారంభించిన రెండున్నరేళ్లలోనే 30 కోట్ల మంది వినియోగదారులు కలిగివున్న సంస్థగా జియో అవతరించింది. మార్చి2న ఈ మైలురాయిని సాధించిందని, కంపెనీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం జరుగుతున్న ఐపిఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ల సందర్భంగా జియో.. 30 కోట్ల మంది వినియోగదారులు కలిగివున్నట్లు ప్రకటనను ప్రచారం చేస్తున్నది. భారతీ ఎయిర్‌టెల్‌ 28.4 కోట్ల మంది వినియోగదారులు ఉన్నట్లు ప్రకటించింది. అంటే టెలికం సేవలు ఆరంభించిన 19 వ సంవత్సరం తర్వాత 30 కోట్ల మైలు రాయిని సాధించింది. జియో కేవలం రెండున్నరేళ్లలోనే ఈ ఘనతను సాధించడం విశేషం. విలీనం తర్వాత ఏర్పడిన వొడాఫోన్‌-ఐడియాలో 40 కోట్ల మంది వినియోగదారులున్నారు.

Untitled Document
Advertisements