కాశ్మీర్ మాజీ సీఎంపై రాళ్ళ దాడి

     Written by : smtv Desk | Mon, Apr 15, 2019, 04:48 PM

కాశ్మీర్ మాజీ సీఎంపై రాళ్ళ దాడి

శ్రీనగర్: జమ్ముకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బైక్‌ ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలో దుండగులు ఆమెపై రాళ్ల దాడి చేశారు. అనంత్‌ నాగ్‌ జిల్లాలో జరిగిన ఈ దాడిలో ఆమె సురక్షితంగా బయటపడగా, ఎస్కార్ట్‌ వాహనం ధ్వంసమైంది. ఖిరాం గ్రామంలో దర్గాను సందర్శించి బిజ్‌ బెహరా పట్టణానికి తిరిగి వస్తుండగా ఆమె వాహన శ్రేణిపై కొందరు రాళ్ల దాడికి పాల్పడ్డారు. దుండగుల బారి నుంచి ఆమెను కాపాడిన భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆమె అనంత్‌ నాగ్‌ స్ధానం నుంచి పోటీ చేస్తున్నారు. 2014లో ఇదే నియోజకవర్గం నుంచి మెహబూబా గెలుపొందారు.

Untitled Document
Advertisements